BigTV English

Nara Rohith – sirisha : నారా రోహిత్ కు కాబోయే భార్య ఆ కమెడియన్ డైరెక్షన్ లో నటించారా?

Nara Rohith – sirisha : నారా రోహిత్ కు కాబోయే భార్య ఆ కమెడియన్ డైరెక్షన్ లో నటించారా?

Nara Rohith – sirisha : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు గతంలో వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నారా రోహిత్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నారా రోహిత్, ప్రతినిధి 2 హీరోయిన్ శిరీష తో నిన్న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే నారా రోహిత్ భార్య గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


నారా రోహిత్, శిరీష ల ఎంగేజ్మెంట్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.. 2019లో ‘బాణం’ సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘సోలో’ మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ ‘ప్రతినిధి 2’ అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఆ సినిమా హీరోయిన్ మాత్రం హీరో లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరి మధ్య పెరిగిన ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ళ పాటు రిలేషన్లో ఉన్న వీరిద్దరి ఇప్పుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కుటుంబం సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 15 పెళ్లి పీటలు ఎక్కనున్నారు.. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. నారా రోహిత్ భార్య గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. ఈమె బ్యాగ్రౌండ్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు నటించిన మొదటి షార్ట్ ఫిల్మ్ గురించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆయనెవరో కాదు.. జబర్దస్త్ కమెడియన్ బాబు. ఇది మీరు అసలు ఉహించి ఉండరు. కేరీర్ మొదట్లో తొలిచూపులోనే అనే షార్ట్ ఫిల్మ్ లో సిరి లెల్లా అద్భుతంగ నటించింది. కానీ, అప్పటికి ఇప్పటికి చాలా ఛేంజెస్ వచ్చాయి. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చి కూడా పదేళ్లు అవుతుంది. ఆ షార్ట్ ఫిలింకు డైరెక్టర్ గా చేసిన జబర్దస్త్ బాబు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సిరి లెల్లా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేస్తుంది.. ఇప్పుడు ఏపీ సీఏం చంద్రబాబు నాయుడుకు కోడలు కాబోతుంది.. వీరిద్దరూ కలిసి డిసెంబర్ 15 న జరుగుతుంది.. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని సమాచారం.. పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా.. లేదా అన్నది చూడాలి..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×