BigTV English
Advertisement

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Books Sailing: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ప్రముఖ కవి కాళోజీ చెప్పిన మాటను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ మాటను ఆయన ఊరికేమీ చెప్పలేదు. అందులో ఎంతో అర్థం దాగి ఉంది. ఒక్క అక్షరం ద్వారా ఎంతో జ్ఞానం మన సొంతమవుతుందనేది దాని అర్థం. మనం నగరాల్లో పర్యటించినప్పుడు అక్కడక్కడ కొంతమంది కనిపిస్తుంటారు. వారి చేతిలో పుస్తకాలు కనిపిస్తుంటాయి. వాటిని వారు విక్రయిస్తూ కనిపిస్తుంటారు. ఇంకొంతమంది రోడ్లపై చివరననో లేదా షాపుల బయటనో.. ఇలా ఎక్కడ చోటు దొరికితే అక్కడ పుస్తకాలను పరిచి వాటిని అమ్ముతుంటారు. అవసరమున్నవారు వారి వద్దకు వెళ్లి కొనుక్కుంటుంటారు. ఇలా పుస్తకాలను విక్రయిస్తున్న వారిలో చాలామంది పేదవారే ఉంటారు. అందులో అంతగా చదువుకోనివారే ఉంటారు. ఆ పుస్తకాలను అమ్ముకుని వాటి నుంచి వచ్చిన డబ్బులతో వారు జీవనం కొనసాగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే.


Also Read: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

అయితే, ఇక్కడ మనం చూడాల్సింది రెండో కోణంలో. అదేమంటే.. పుస్తకాలు విక్రయిస్తున్నవారు రోడ్డుపై ఎక్కడో నిలబడో లేదా రోడ్డుపై చివరన పరిచి విక్రయిస్తుంటారు. వారి వద్ద ఎన్నో రకాలైన పుస్తకాలు లభిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా వాడిన పుస్తకాలు.. అంటే వేరేవాళ్లు చదివి.. కొంత పాతగా అయిన పుస్తకాలను వారు విక్రయిస్తుంటారు. ఇంకొంతమంది కొత్తవే విక్రయిస్తుంటుంటారు. హైదరాబాద్ లో అయితే కోఠి, మెహిదీపట్నం, అమీర్ పేట్, సికింద్రాబాద్, అశోక్ నగర్.. ఇలా చాలా ప్రాంతాల్లో ఆ విధంగా పుస్తకాలను విక్రయించేవాళ్లు కనిపిస్తుంటారు. ఒక్కోసారి మార్కెట్ లో దొరకని పుస్తకాలు వారి వద్ద దొరుకుతుంటాయి. అది కూడా తక్కువ ధరకే లభిస్తుంటాయి. కొంతమంది వారికి కావాల్సిన పుస్తకాలు దొరకక ఎంతో సతమతవుతుంటుంటారు. అటువంటివారికి కూడా ఇక్కడ అనుకున్న పుస్తకాలు దొరుకుతుంటాయి. మార్కెట్లో షాపుల వద్ద పుస్తకాల ధరకు, వీరి వద్ద లభించే పుస్తకాల ధరకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. వారు ఇలా పుస్తకాలను విక్రయించి మనకు మంచి చేస్తున్నట్టే అని చెప్పాలి. ఎందుకంటే పుస్తకాలను చదివితే ఎన్నో లాభాలు ఉంటాయి. మనుషుల జీవితాలు మారుతాయి. పుస్తకాల వల్ల కలిగే విజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుస్తకాలు చదివితే తాను అనుకున్నది సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అది పోటీ పరీక్షలైనా లేదా జీవిత పరీక్షలైనా సరే.. పుస్తకాలతో ఓ మార్గం దొరుకుతుంది.. ఆ తరువాత విజయం వారి సొంతమవుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. క్రమశిక్షణ అలవాటు పడుతుంది. పుస్తకాలను చదవడం వల్ల మనిషి ఆలోచన విధానమే మారిపోతుంది. గొప్ప గొప్ప లక్ష్యాలను ఈజీగా ఛేదించగలడు. కొత్త కొత్త విషయాలను నేర్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఇలా ఎన్నో రకాలుగా పుస్తకాలు మనకు మంచి చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే.. పుస్తకాలు మనకు మేలు చేస్తాయే తప్ప ఏ మాత్రం హానీ చేయవు.


Also Read: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

అయితే, ప్రస్తుతం మానవుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఈ క్రమంలో పుస్తకాలను చదవడం కంటే సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో, కంప్యూటర్లలో చదివేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ, ఇలా చదవడం కంటే నేరుగా పుస్తకాలను చదివడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో చదివితే పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అదే నేరుగా పుస్తకాలను చదివితే అలాంటి సమస్యే ఉండదంటా. ఆత్మవిశ్వాసం బలంగా తయారవుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయి పుస్తకాలను చదివితే. అంటే ఆ పుస్తకాలను అమ్ముతున్న వ్యక్తి మనకు మేలు చేస్తున్నట్టే కదా. అతను ఏదో విధంగా ఆ పుస్తకాలను సమకూర్చుకుని వాటిని మనకు విక్రయిస్తుంటారు. అలా విక్రయించిన డబ్బులతో తాను జీవనోపాధిని పొందుతాడు. మనం విజ్ఞానం పొందేందుకు ఒక రకంగా అతను హెల్ప్ చేసినవాడవుతాడు. అటువంటి వ్యక్తులను కొంతమంది హేళనగా చూస్తుంటారు. వారివైపు అదోలా చూస్తుంటారు. మార్కెట్లో రకరకాల వస్తువులను మాయమాటలు చెప్పి విక్రయిస్తుంటారు. వాటి ధర విషయంలో వారిదే ఫైనల్. వారు ఎంతచెబితే అంతకే కొనాలి. ఇంకొంతంది పరిపరి విధాలుగా మోసం చేస్తుంటారు. కానీ, ఇలా రోడ్లపై పుస్తకాలను అమ్ముతూ బ్రతికేవారు తమ చిన్నపాటి ఈ వ్యాపారం ద్వారా ఎవరికీ ఏ హానీ చేయరు. వారు ఒకరకంగా మన విజ్ఞానానికి తోడవుతున్నట్టే. అందువల్ల వారి పట్ల మంచి అభిప్రాయం, సానుభూతిని కలిగి ఉండాలని పుస్తక ప్రియులు కోరుతున్నారు.

Tags

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×