BigTV English
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.. ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా  ఏంటో తెలుసా.. ?

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150 కి పైగా సినిమాలు చేశారు అన్న విషయం అందరికీ తెల్సిందే. కానీ, ఒక సినిమాకు చిరు దర్శకత్వం కూడా వహించారు. ఏంటి.. నిజమా.. ? అని అంటే అవును.. నిజమే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.  ఆ చిత్రమే   ఇంద్ర.  అమ్మ బాబోయ్ .. ఇది నమ్మలేకపోతున్నాం అనుకుంటున్నారా.. ? ఇంద్ర సినిమాకు 30 రోజులు డైరెక్టర్ బి. గోపాల్ అందుబాటులో లేకపోతే.. చిరునే ఆ షెడ్యూల్ కు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్నీ నటుడు రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.


చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్ట్ లో ఇంద్ర ఒకటి. బి. గోపాల్ దర్శకత్వం వహించిన  ఈ సినిమా 2002 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 22 ఏళ్ళ తరువాత ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 22 న చిరు పుట్టినరోజు సందర్భంగా  ఇంద్ర రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్లో ఇది కూడా ఒకటి.  ఇంద్ర చేస్తున్న సమయంలోనే బి. గోపాల్.. ఎన్టీఆర్ తో అల్లరి రాముడు కూడా తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఆ సినిమా సాంగ్ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతుంటే బి. గోపాల్ అక్కడకు వెళ్ళాడు. అప్పుడు గోపాల్ దర్శకత్వ బాధ్యతను చిరు చెప్పాడట. ఇంద్ర ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హోమం, ఘల్లు ఘల్లుమని సాంగ్ ను మొత్తం చిరునే డైరెక్ట్ చేసినట్లు రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడు.


” ఇంద్ర సినిమా అప్పుడు  మే నెలలో.. బి గోపాల్ గారు.. ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా సాంగ్ షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు.  అప్పుడు చిరంజీవి గారు ఇంద్ర సినిమా ప్లాష్ బ్యాక్ మొత్తం ఆయనే డైరెక్ట్ చేశారు.  వర్షం, సాంగ్ ఎపిసోడ్ మొత్తం ఆయనే దర్శకత్వం వహించారు. ఆ ఎపిసోడ్ లో నేను లేను కానీ, షూటింగ్ దగ్గర ఉండేవాడిని. ఆ ఎండలో క్యార్ వ్యాన్ నుంచి కాలు పెడితే ఎండ వేడి. మెంటల్ వచ్చేసింది.  ఆ వేడిలో చిరంజీవి గారు హోమం చేస్తూ షూటింగ్ చేశారు. పైన ఎలాంటి షర్ట్ లేకుండా..  29 రోజులు షూటింగ్ చేశారు.

షూటింగ్ అయ్యాక ఆఖరున వెళ్లి  అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు చేతులు ఎత్తి క్షమించమని అడిగారు. సినిమా ఆలస్యం అవుతుందని.. ఇంత ఎండలో షూటింగ్ పెట్టాను. నన్ను క్షమించండి అని దండం పెట్టారు.  వారు.. బాబు నువ్వు ఒక నెల షూటింగ్ చేయకపోతే ఏం కాదు. కానీ, మేము ఒక్కరోజు షూటింగ్ చేయకపోతే మాకు తినడానికి ఉండదు. మేమే మీకు థాంక్స్ చెప్పాలి అని అన్నారు. అది మెగాస్టార్ అంటే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంద్ర రీ రిలీజ్ లో మెగా ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలంటే  మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×