BigTV English

Bharateeyudu: కమల్ హాసన్ కన్నా ముందు సేనాపతిగా ఏ టాలీవుడ్ హీరోను అనుకున్నారో తెలుసా.. ?

Bharateeyudu: కమల్ హాసన్ కన్నా ముందు సేనాపతిగా ఏ టాలీవుడ్ హీరోను అనుకున్నారో తెలుసా.. ?

Bharateeyudu: రేపు భారతీయుడు 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రతిఒక్కరు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2 ను చూడాలంటే ముందు భారతీయుడును చూడాలి. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. సేనాపతిగా కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాదు.. గుండెల్లో పెట్టుకున్నారు. ఆ సమయంలో లంచం అనే మాట ఎత్తితే సేనాపతి వస్తాడు అనే భయంతో పనిచేసేవారట ఉద్యోగులు. అంతలా భారతీయుడు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.


అయితే శంకర్ .. మొదటి ఈ కథ రాసుకున్నప్పుడు సేనాపతిగా కమల్ హాసన్ ను అనుకోలేదట. అసలు ఈ కథను మొదట రజినీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని శంకర్ కథ రాసాడట. జెంటిల్ మ్యాన్ సినిమా హిట్ కావడంతో తరువాత ప్రేమికుడు సినిమాను అనౌన్స్ చేసి.. ఆ సినిమా షూటింగ్ చేస్తూనే రజినీకాంత్ కు పెరియ మనుషున్ అనే కథను వినిపించాడట. అది నచ్చడంతో రజినీ సైతం ఓకే చెప్పాడట. కానీ, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ఇక ఆ కథనే కొద్దిగా మార్చి భారతీయుడుగా తెరక్కించాడట శంకర్. రజినీ తరువాత సేనాపతిగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ను తీసుకోవాలనుకున్నాడట. సేనాపతి కొడుకుగా వెంకటేష్ నో, నాగార్జుననో తీసుకుంటే బావుంటుందని ప్లాన్ చేశాడట. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. తమిళ్ లో కార్తీక్, సత్యరాజ్ ను అనుకున్నా.. సెట్ అవ్వలేదు.


ఇక చివరికి భారతీయుడు కథ కమల్ దగ్గరకు వెళ్ళింది. ఆయన తండ్రీకొడుకుల పాత్రలు రెండు తానే చేస్తాను అనడంతో భారతీయుడు పట్టాలెక్కింది. కేవలం కమల్ విషయంలోనే కాదు.. హీరోయిన్స్ విషయంలో కూడా చాల చర్చలు జరిగాయట. మనీషా కొయిరాలా పాత్ర కోసం ముందు ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట. ఆమె యాడ్స్ ఏజెన్సీ కాంట్రాక్ట్ పూర్తికావడంతో నటించలేకపోయింది.

ఇక ఆ ప్లేస్ మనీషా సొంతం చేసుకుంది. ఇక సేనాపతి భార్యగా మొదట రాధికాను అనుకున్నారట. చివరికి సుకన్యకు ఆ ఛాన్స్ వచ్చి చేరింది. ఇలా కమల్ తో భారతీయుడు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మరి రేపు రిలీజ్ కానున్న భారతీయుడు 2 ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×