E-Paper
Advertisement

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?
Advertisement

Tollywood:  మలయాళంలో హేమా కమిటీ ఎఫెక్ట్ ఏమో  కానీ.. టాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసుల రచ్చ హీట్ ఎక్కిస్తుంది. జానీ మాస్టర్ పేరు బయటకు రావడంతో.. అందరు అతనిపై విరుచుకుపడుతున్నారు.  అయితే గతంలో కూడా చాలామంది సెలబ్రిటీల మీద ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అవి నిరూపణ కాకపోయినా.. అప్పట్లో కూడా ఇలానే   వారు సోషల్ మీడియాను షేక్ చేశారు. మరి వారిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

బన్నీవాసు

Advertisement

టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో బన్నీ వాసు ఒకరు.  గీతా ఆర్ట్స్  లో బన్నీ వాసు అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ ఏడాది ఆయ్ సినిమాతో బన్నీ వాసు మంచి విజయమే అందుకున్నాడు. ఇక గతంలో బన్నీవాసుపై ఒక  జూనియర్ ఆర్టిస్ట్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి వాడుకొని వదిలేశాడని, అతనిపై కేసు పెట్టినందుకు ఇంకా తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా.. నాలుగుసార్లు చంపడానికి కూడా ప్రయత్నించాడని, తనకు న్యాయం చేయాలనీ గీతా ఆర్ట్స్ ముందు అప్పట్లో అర్ధనగ్నంగా ధర్నా కూడా చేసింది. అయితే సునీత బోయకు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదని, ఆమె కేవలం  ఫేమస్ అవ్వడానికి ఇలా చేస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సునీత బోయ సైలెంట్ గా ఉంటుంది. అప్పట్లో ఈ కేసు కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది.

Advertisement

దగ్గుబాటి అభిరామ్ 

దగ్గుబాటి  కుటుంబాన్ని మొత్తం రోడ్డుకు లాక్కొచ్చింది  నటి శ్రీరెడ్డి. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దగ్గుబాటి వారసుడు.. నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్.. తనను వాడుకొని వదిలేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది. సినిమా హీరోయిన్ చేస్తాను అని, తన వెంట తిప్పించుకొని తనను మోసం చేశాడని శ్రీరెడ్డి కేసు పెట్టింది. అవకాశాలు ఎరవేసి తనను అభిరామ్ వాడుకున్నాడని, తర్వాత ఆటబొమ్మగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేనా అతడితో తనకు పెళ్లి జరిపించాలని, తనకు న్యాయం చేయాలనీ ఫిల్మ్ ఛాంబర్  ముందు నగ్నంగా ధర్నా చేసింది.

అభిరామ్ తో కలిసి దిగిన ఫొటోస్, చాట్స్ అన్ని లీక్ చేసింది. అందులో అభిరామ్ పచ్చిగా మాట్లాడిన మాట్లాడిన మాటలను కూడా ఆమె మీడియా ముందు చూపించింది. ఆ తరువాత దగ్గుబాటి కుటుంబానికి, శ్రీ రెడ్డికి మధ్య ఒప్పందం జరిగిందని సమాచారం.   కొన్నిరోజులు అభిరామ్ గొడవను వదిలేసి చెన్నైకు వెళ్ళిపోయింది. ఈ గొడవ తరువాతనే క్యాస్టింగ్ కౌచ్ అంటే చాలామందికి తెల్సింది. ఇకపోతే ప్రస్తుతం అభిరామ్ పెళ్లి చేసుకొని.. కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీరెడ్డి.. వైసీపీ కి సపోర్ట్ చేస్తూ అప్పుడప్పుడు యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంది.

రాజ్ తరుణ్ 

హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గురించి అందరికి తెల్సిందే. లావణ్య అనే యువతీ..  రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని, ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని.. తనను వదిలేసాడని కేసు పెట్టింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  రాజ్ తరుణ్ తనను 7 ఏళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడని, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య  ఆరోపించింది.  రాజ్ తరుణ్ కూడా లావణ్యతో రిలేషన్ నిజమే కానీ, ఆమె ప్రవర్తన  బాగోలేక బ్రేకప్ చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ వివాదం కు సంబంధించిన ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. మీడియా మొత్తం లావణ్య మీదనే ఫోకస్ చేసింది. చివరికి రాజ్ తరుణ్ తనను వద్దు అని చెప్పడంతో కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పి వదిలేసింది. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది.

జానీ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న జానీ మాస్టర్  పై జూనియర్ డ్యాన్సర్ కేసు పెట్టిన విషయం  తెల్సిందే.  తనను కార్ వ్యాన్ లో రేప్ చేశాడని, ఆమె భార్య కూడా మతం మార్చుకోమని టార్చర్ చేసిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఇక దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో టాలీవుడ్ అంతా ఏకం అయ్యారు. జానీని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తున్నారు.

వీరందరూ  పేర్లు బయటపడ్డాయి కాబట్టి అందరికి తెలిశాయి. కానీ, టాలీవుడ్ లో చాలామంది కథలు  బయటకు రాలేదు. క్యాస్టింగ్  కౌచ్  ను ఎదుర్కున్న నటీమణులు చిన్నవారే అయినా.. వారిని వేధించిన హీరోలు చాలా  పెద్దవారు కాబట్టి బయటకు చెప్పడానికి భయపడుతున్నారు అని చెప్పాలి. ఇక జానీ మాస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించిన ఎన్నో ఆరోపణలు  బయటపడుతున్నాయి. కానీ, వీరిపై ధైర్యంగా ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. మరి ముందు ముందు ఇంకెవరైనా బయటపడతారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×