Kirrak Couples Episode 3 Promo: బిగ్ టీవీ స్పెషల్ షో ‘కిర్రాక్ కపుల్స్’ ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తోంది. సీరియస్ న్యూస్ నుంచి రిలాక్స్ పొందేలా, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఆకట్టుకుంటోంది. ప్రతివారం ఈ షోలో ముగ్గురు జంటలు పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ వారంలో కూడా మరో ముగ్గురు కపుల్స్ పాల్గొని ఫుల్ గా నవ్వించారు. ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. కపుల్స్ చెప్పిన స్టోరీలు, ఆడిన ఆటలు, యాంకర్లు ఆటో రాం ప్రసాద్, భ్రమరాంబిక వేసిన పంచులు అందరినీ అలరిస్తున్నాయి.
మార్చి 15న నిశ్చితార్థం 21న లాక్ డౌన్
ఎప్పటిలాగే ఈవారం ప్రోమో కూడా సూపర్ డూపర్ స్టెప్పులతో ప్రారంభం అయ్యింది. కంటెస్టెంట్లు దుమ్మురేపేలా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈవారం ‘కిర్రాక్ కపుల్స్’ షోలో ఆదిరెడ్డి-వెన్నెల, షరీఫ్-కాసు, ప్రవల్లిక-సదాన్ జంటలు పాల్గొన్నాయి. వీళ్లు చెప్పిన పెళ్లి ముచ్చట్లు, ఫన్నీ సంగతులు అందరినీ ఎంటర్ టైన్ చేశాయి. ముఖ్యంగా ప్రవల్లిక-సదన్ ప్రేమ విషయం చెప్పిన దగ్గరి నుంచి ఆసక్తికర ఘటనలు జరిగినట్లు చెప్పారు. “మేం ఇద్దరు లవ్ లో ఉన్నామని ఇంట్లో చెప్పాక.. 15 రోజులకు నిశ్చితార్థం అయ్యింది. వారానికే కోవిడ్ వచ్చింది. మార్చి 15న ఎంగేజ్ మెంట్ కాగా, మార్చి 21న లాక్ డౌన్ అనౌన్స్ చేశారు” అని చెప్పడంతో అందరూ నవ్వారు.
ఆకట్టుకున్న ఆదిరెడ్డి, వెన్నెల పెళ్లి చూపుల స్కిట్
ఇక ఆదిరెడ్డి, వెన్నెల పెళ్లి చూపుల స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. ఆదిరెడ్డి తండ్రిగా ఆటో రాం ప్రసాద్ ఉండగా, వెన్నెల తల్లిగా భ్రమరాంబిక యాక్ట్ చేసింది. పెళ్లి చూపులలో అమ్మాయి కంటే అమ్మాయి తల్లే బాగుందంటూ ఆటో రాం ప్రసాద్ వేసిన పంచ్ అందరినీ ఆకట్టుకుంది. అమ్మాయికి పెళ్లి చూపులు అంటూ అమ్మాయికి తల్లికి లైన్ వేస్తూ రామ్ ప్రసాద్ ఫుల్ ఫన్ జెనరేట్ చేశాడు.
బరువు ఎత్తలేకపోయిన ఆది, పెదవి కొరికిన షరీఫ్
ఇక భార్యలను ఎత్తుకుని భర్తలు పండ్లు తినే గేమ్ ఫన్నీగా ఆకట్టుకుంది. చేతులతో పట్టుకోకుండా కపుల్స్ నోటితో పండ్లు తీసుకుని తింటూ ఆహా అనిపించారు. ఇక తన భార్య బరువును మొయ్యలేక ఆదిరెడ్డి పడ్డ అవస్థ చూసి అందరూ నవ్వారు. షరీఫ్ కంగారు కంగారుగా పండ్లు తింటూ ఆయన భార్య పెదవి కొరకేశాడు. మరీ సెప్టిక్ అయ్యేలా కొరుకుతావా? అని ఆటో రామ్ ప్రసాద్ అనడంతో నవ్వుల్లో మునిగిపోయారు. పెదాలు కొరకడం ఇప్పుడేనా? ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా? అంటూ యాంకర్ భ్రమర వేసిన డబుల్ మీనింగ్ పంచ్ పటాస్ లా పేలింది.
ఇక తాజాగా ప్రోమోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ చానెల్‌లో యూట్యూబ్ చానెల్లో అందుబాటులోకి రానుంది. శనివారం నాడే కాదు, టైమ్ ఉన్నప్పుడు ఈ ఫన్నీ షో చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. తాజాగా ‘కిర్రాక్ కపుల్స్’కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!