EPAPER

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

Budh Gochar 2024: బుధుడు.. మేధస్సు, వ్యాపారం, కమ్యూనికేషన్, ప్రసంగాలకు బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు. ఇది మిధునం, కన్యారాశికి కూడా అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఏ రాశుల వారికి అధిపతిగా ఉన్నాడో ఆ రాశుల వారు వ్యాపార రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. అంతే కాకుండా మేధస్సును కలిగి ఉంటారు.


ఈ రెండు రాశుల వారు అందరితో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటారు. సెప్టెంబర్ 23 న, బుధుడు సింహరాశిని విడిచి తన స్వంత రాశి అయిన కన్యలోకి ప్రవేశించనున్నాడు. అటువంటి పరిస్థితిలో, కన్యారాశిలో మెర్క్యురీ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి బుధుని సంచారం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ కాలంలో, మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. వైవాహిక జీవితంలో ఆనందం పెరగుతుంది. అంతే కాకుండా అనేక సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో ప్రశంసలు అందుకుంటారు. కెరీర్ పరంగా విద్యార్థులకు ఇది మంచి సమయం.


కన్య రాశి :
ఈ సంచారం కన్య రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ కాలంలో మీడియా, వస్త్ర వ్యాపారం, విద్యా రంగాల్లో పని చేసే వ్యక్తులు ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో నెలకొన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మెడిసిన్ వ్యాపారం చేసే వారు అధిక లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  కొన్ని నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేసే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు.

Also Read: వీరిపై సూర్యగ్రహణ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందులే !

ధనుస్సు రాశి :
కన్యారాశిలో బుధుడు సంచరించడం ధనుస్సు రాశి వారికి శుభప్రదం . ఈ సంచారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు. ఈ సమయంలో, మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.  వైవాహిక జీవితం బాగుంటుంది.

మీన రాశి:
మీన రాశి వారికి బుధుడి రాశి మార్పు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. మీన రాశి వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. 23 సెప్టెంబర్ 2024 నుంచి మీరు అనేక రంగాల్లో ప్రయోజనాలను పొందుతారు. పని చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో వివాహానికి కూడా ఇది చాలా మంచి సమయం. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కెరీర్ పరంగా చాలా బాగుంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Lakshmi Puja 2024: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

Guru Vakri 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో గురుడు తిరోగమనం.. 119 రోజులు ఈ 3 రాశుల వారి జీవితంలో ఆనందమే

Tulsi Chalisa Benefits: కోరికలు తీరి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ సాధారణ పని చేయండి !

Budhaditya Rajyog 2024: సూర్యుడు-బుధుడు కలిసి బుదాధిత్య రాజయోగం ఈ 3 రాశుల వారు ధనవంతులు అవుతారు

Grah Gochar: కర్కాటక రాశితో సహా ఈ 4 రాశుల వారు ఆర్థికంగా లాభపడతారు

Horoscope 14 october 2024: ఈ రాశి వారికి అనుకూలం.. పట్టిందల్లా బంగారమే!

Shani Vakri 2024: 30 సంవత్సరాల తర్వాత దీపావళి నాడు శుభ యోగం.. ఈ 4 రాశుల జీవితంలో అన్నీ శుభ దినాలే

Big Stories

×