E-Paper
Advertisement

Varun Tej- Lavanya tripathi : వరుణ్- లావణ్య పెళ్లి ..ఇటలీలోనే ఎందుకు జరుగుతుందో తెలుసా?

Varun Tej- Lavanya tripathi :  వరుణ్- లావణ్య పెళ్లి ..ఇటలీలోనే ఎందుకు జరుగుతుందో తెలుసా?
Advertisement

Varun Tej- Lavanya tripathi : మెగా ఫ్యామిలీ పెళ్లి బాజాలు ఇటలీలో మోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకున్నారు. మరోపక్క అన్న హోదాలో రామ్ చరణ్ దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. పెళ్లికి సంబంధించి ఏ రోజు ఏ ఫంక్షన్స్ ఉంటాయి అన్న లిస్టును కూడా కొణిదెల ఫ్యామిలీ మీడియాకు రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఒకటే..అసలు ఇంతకీ వీళ్లిద్దరూ పెళ్లి ఇటలీలు ఎందుకు చేసుకోవాలనుకున్నారు?

ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లో మెగా ప్రిన్స్ వివాహం లావణ్యతో జరుగుతుంది. నవంబర్ 1 న వీరిద్దరూ వేద మంత్రాల సాక్షిగా భార్యాభర్తలవుతారు. మూడు రోజులపాటు ఇటలీ వేదికగా వీరి వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగనుంది. పెళ్లి పూర్తయిన రోజు రాత్రి విందుతో ఇక ఇటలీలో పెళ్లి తంతు ముగుస్తుంది.

Advertisement

ఈరోజు అక్టోబర్ 31న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లిలో భాగంగా హల్దీ ,మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నారు. ఇక రేపు పెళ్లి తర్వాత రాత్రి కుటుంబ సభ్యులకు ,ఇటలీకి విచ్చేసిన స్నేహితులకు రిసెప్షన్ ఏర్పాటు చేసి.. మెగా ఫ్యామిలీ నూతన వధూవరులతో కలిసి నవంబర్ 2 న లేక 3 న హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానుల కోసం నవంబర్ 5న గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తారు.

ఇక ఈ పెళ్లి తంతుకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ.. అందరూ హాజరైనప్పటికీ ఒక్కరు మాత్రం రాలేకపోయారు.మెగాస్టార్ తల్లి అంజనాదేవి అనారోగ్య కారణం వల్ల ఇటలీ వెళ్లలేక పోయారు. ఆమె వసతి కోసం ఇంటివద్ద మనవడి పెళ్లి చూసే విధంగా మెగా ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. కానీ అసలు పెళ్లి ఇటలీలో ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం.. మనలో చాలామందికి తెలియదు. అదిగో ఆ అసలు రీజన్ ఇదేనంట.

Advertisement

లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ తో కలిసి నటించిన మొదటి సినిమా మిస్టర్ మూవీ అందరికీ గుర్తుందా..? అయితే ఆ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది అన్న విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అదిగో అలా మొదటి పరిచయం ఇటలీలో జరిగి మెల్లగా అది ప్రేమ వరకు వెళ్లి ఇప్పుడు ఏడు అడుగుల బంధంగా మారబోతోంది. అందుకే తమ ప్రేమ పుట్టిన చోటే పెళ్లి పుస్తకం మొదటి పేజీ మొదలు పెట్టాలని ఈ జంట నిర్ణయించుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో మెగా వారి పెళ్లి సందడి ఇటలీ వేదికగా మారింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×