BigTV English

Influencers : ఇన్‌ఫ్లూయెన్సర్లా.. మజాకానా?

Influencers : ఇన్‌ఫ్లూయెన్సర్లా.. మజాకానా?

Influencers : పెద్దల మాట చద్దిమూట అంటారు. అందుకే మన పెద్దవాళ్లు చెప్పిన దానిని కచ్చితంగా ఆలకిస్తాం..ఆచరిస్తాం. మంచీచెడూ చెప్పేందుకు పెద్దవాళ్లకు ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు తోడయ్యారు.


ఏ సినిమా స్టారో, అభిమాన ప్లేయరో ఫలానా ప్రోడక్టు మంచిదని కితాబు ఇవ్వడం ఆలస్యం.. అభిమానులూ ఫాలో అయిపోతుంటారు. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ల హడావిడి బాగా పెరిగింది. ప్రజల కొనుగోలు నిర్ణయాలను వారు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ప్రధానంగా బ్రెజిల్, చైనా, ఇండియాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్ల పాత్ర కొట్టొచ్చినట్టు కనపడుతోందని తేల్చింది.

బ్రెజిల్, భారత్‌లలో ఈ తరహా ధోరణి ఎక్కువగా ఉండగా.. చైనాలో ఇటీవలే తగ్గుముఖం పట్టింది. 2017, 2019, 2022, 2023లో నిర్వహించిన సర్వేల్లో 2 నుంచి 10వేల మంది వరకు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రకటనల ద్వారా ఎంత మంది ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నది ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో తాజా సర్వే గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. చైనాలో 2019లో 39% మంది రెస్పాండెంట్లు ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావానికి లోనై ప్రోడక్టులను కొనుగోలు చేశామని చెప్పారు. 2023లో అలా చెప్పిన వారి శాతం 36కి పడిపోయింది.

మిగిలిన అన్ని దేశాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. బ్రెజిల్‌లో అది 36 శాతం నుంచి 44 శాతానికి చేరగా.. ఇండియాలో 27% నుంచి 41శాతానికి, ఇటలీలో 18 నుంచి 24 శాతానికి చేరింది. స్పెయిన్‌లో 15 నుంచి 22 శాతానికి, అమెరికాలో 14 నుంచి 21, బ్రిటన్ 13% నుంచి 20 శాతానికి పెరిగింది. ఇక జర్మనీలో ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావం 8%, డెన్మార్క్, జపాన్ దేశాల్లో 5% చొప్పున పెరిగింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×