BigTV English

Game Changer movie : గేమ్ చేంజర్ లో గేమ్ చేంజింగ్ ట్విస్ట్.. ఆ ఒక్క సీన్ చాలు

Game Changer movie : గేమ్ చేంజర్ లో గేమ్ చేంజింగ్ ట్విస్ట్.. ఆ ఒక్క సీన్ చాలు

Game Changer movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం గేమ్ చేంజర్‌. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.


కియారా అద్వానీ మహేష్ బాబు భరత్ అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. అయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేక పోయింది. ఇక ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ మూవీ లతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ గ్లామర్ డోస్ బాగా పెంచింది ఇక ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వార్త బాగా వైరల్ అయింది. గేమ్ చేంజర్‌ మూవీ లో ఉన్న గేమ్‌ చేంజింగ్ సీన్‌ గురించిన ఆ న్యూస్ ఇప్పుడు మూవీ పై బాగా బజ్ పెంచింది. పైగా ఈ ఒక్క సీన్ అప్పటివరకు సాగుతున్న సినిమా తీరునే మారుస్తుందని టాక్. పైగా ఇంటర్వెల్ టైం లో వచ్చే ఈ ఒక్క సీన్ తో సెకండ్ హాఫ్ ఊహించని ట్విస్ట్ తీసుకోవడమే కాకుండా ఆసక్తికరంగా మారుతుందట.


శంకర్ డైరెక్షన్ అంటేనే మూవీ ఎంత భారీగా ఉంటుందో అందరికీ తెలుసు. పైగా కరెక్ట్ గా ఇంటర్వెల్ సీన్ కి ముందు హీరో హీరోయిజం చూపించే సీన్ హై లైట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. గేమ్‌ చేంజర్ మూవీ లో కూడా శంకర్ మార్క్ ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మూవీ రేంజ్ ను అమాంతం మార్చే లాగా ఉంటుందని మూవీ యూనిట్ టాక్.అలాగే మూవీ ముందుకు వెళ్లే కొద్ది ట్విస్ట్ లు ఏ రేంజ్ లో ఉంటాయి అంటే..ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠత ప్రేక్షకులను కుదిపేస్తుంది.

అంటే గేమ్‌ చేంజర్ మూవీ కే గేమ్‌ చేంజింగ్ పాయింట్‌ ఇంటర్వల్ టైం లో రివిల్ అవుతుందన్నమాట. ఈ మూవీ లో చరణ్ యంగ్‌ లుక్, ఓల్డ్‌ లుక్ లో కనిపిస్తాడు. ఇందులో చెర్రీ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తాడు అని అర్థం అవుతుంది. మరి రెండు పాత్రలు ఒకే సారి స్క్రీన్ పై చూస్తామా లేక ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి, ప్రజెంట్ లో కొడుకును చూస్తామా అన్న విషయం పై క్లారిటీ సినిమా విడుదలైన తర్వాతే వస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×