BigTV English

Nagarjuna’s convention hall: ఎన్ కన్వెన్షన్ కు సమంత శాపం చుట్టుకుందా?

Nagarjuna’s convention hall: ఎన్ కన్వెన్షన్ కు సమంత శాపం చుట్టుకుందా?

Due to the Samantha Curse Bulldozers demolish Nagarjuna’s convention hall in Hyderabad: సినీ నటుడు అక్కినేని నాగార్జున కలల ప్రాజెక్టు ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అక్రమ, అనధికార నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. జీహెచ్ ఎంసీ అనుమతులు లేకుండానే దాదాపు 3 ఎకరాల పరిధిలో చేపట్టిన నిర్మాణాలు కూల్చివేతకు గురయ్యాయి. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో తమ్మిడికుంట చెరువు భారీ ఆక్రమణకు గురయిందని..దీనితో దాదాపు యాభై శాతం చెరువు కుచించుకుపోయిందని అధికారులు ఆరోపిస్తున్నారు. కొద్ది పాటి వర్షాలు వస్తే చాలు చెరువు పరిధి ప్రాంతాలతో సహా హైటెక్ సిటీ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోతోందని.. వీటిని కూల్చివేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.


అడ్వాన్సులు తిరిగి చెల్లించాల్సిందే..

అసలే పెళ్లిళ్ల సీజన్. ఇప్పటికే ఈ ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకున్న వారు నగదు చెల్లింపులు సైతం అడ్వాన్సుగా చెల్లించడం కూడా జరిగింది. కట్ చేస్తే.. ఇటీవల హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళకు ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నాగార్జునే ఈ జంటకు అండగా నిలబడి ఎంగేజ్ మెంట్ జరిపించారు. సమంత, నాగచైతన్యలు విడిపోయినప్పుడు సైతం నాగ్ వీరిద్దదరినీ కలిపేందుకు ప్రయత్నించలేదని నెటిజన్స్ ఆరోపణ. సమంత మాత్రం అప్పుడప్పుడు తన లైఫ్ గురించి విరక్తితో మాట్లాడేది. అంతా చైతూదే తప్పని అప్పట్లో బాహాటంగానే విమర్శలు గుప్పించారు. సమంత, నాగచైతన్య ఎప్పటికైనా కలుస్తారని అభిమానులు ఆశించారు. పైగా వీళ్లిద్దరూ అదిగో కలుస్తున్నారు.. ఇదిగో కలుస్తున్నారంటూ నెట్టింట వార్తలు కూడా హల్ చల్ చేశాయి.


సమంతకు అన్యాయం

కొంతకాలం స్తబ్దంగా ఉన్న ఈ జంటకు షాక్ ఇస్తూ శోభిత ధూళిపాళ్ల చైతూ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. సమంత విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని అభిమానులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. చైతూదే తప్పంతా అని గొడవ పెడుతున్నారు. కనీసం సమంతను సంప్రదించకుండానే.. మాట మాత్రమైనా చెప్పకుండా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం.. దానికి హీరో నాగార్జున మద్దతు ఇవ్వడం అంతా సామ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా నాగ్ ఫ్యామిలీ హీరోలకు సరైన హిట్లు కూడా రావడం లేదు. నాగచైతన్య, అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ ఫెయిలవుతూ వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో నాగ్ ఆస్తులకు భారీ నష్టం చేకూరనుంది. గత బీఆర్ఎస్ సర్కార్ మంత్రుల అండతో నాగ్ అప్పట్లో సేఫ్ గా బయటపడ్డాడు.

కఠినంగా హైడ్రా అమలు

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అక్రమ భవనాలు, కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు కొత్తగా హైడ్రా చర్యలు చేపట్టింది. దీని ప్రకారం చెరువులు ఆక్రమించి భవనాలు కట్టుకున్నా.. చెరువులు ఉన్న స్థలాలను కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగానే హీరో నాగ్ కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభావం అంతా సమంతను మానసిక క్షోభకు గురిచేయడం వలనే అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నాగ్ ఫ్యామిలీపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరైతే నాగ్ కు తగిన శాస్తే జరిగిందని.. సమంత కు చేసిన అన్యాయమే నేటి కూల్చివేతల ఫలితం అంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×