BigTV English
Advertisement

Rain Alert: రానున్న మరో మూడ్రోజులు వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

Rain Alert: రానున్న మరో మూడ్రోజులు వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

Telugu States heavy rains alert: తెలంగాణ, ఏపీలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడం ప్రభావం ఏర్పడింది. దీంతో కోస్తా జిల్లాతోపాటు హైదరాబాద్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.


రానున్న మూడు నుంచి నాలుగు రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Also Read:  మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు

ఇదిలా ఉండగా, గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసిముద్దయింది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

Related News

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×