BigTV English

MLC Ashok Babu: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు

MLC Ashok Babu: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు

TDP MLC Ashok Babu Fire On YCP Complaints: పోస్టల్ బ్యాలెట్‌‌లో 90 శాతం ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అందుకే ఆ ఓట్లను తగ్గించుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను టీడీపీ ఏం కోరిందో తెలుసుకోకుండా వైసీపీ ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు అని అన్నారు.


టీడీపీ 750 ఫిర్యాదులను చేస్తే వాటిలో కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై  ఎన్నికల సంఘానికి తాము చేసిన ఫిర్యాదును వైసీపీ నేతలు తప్పుగా చిత్రీకరిస్తున్నరని ధ్వజమెత్తారు.

పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి తక్కువ ఓట్లు రావడంతోనే కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తాము ఓడి పోతున్నామన్న సంగతి పైసీపీ నేతలకు ముందే తెలిసిపోయిందన్నారు. అందుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నేతలపై 400కు పైగా కేసులు ఉన్నాయని ఆరోపించారు. కోర్టులంటే వారికి లెక్క లేదని అన్నారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు సైతం వైసీపీకి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్‌కు మందు జూన్ 4న వస్తుందని తెలిపారు.


Related News

RK Roja: చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా

YSR Congress Party: తీవ్ర విషాదం.. వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి..

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

AP Women: ఏపీలో మహిళలకు శుభవార్త.. 2 లక్షల వరకు చేయూత, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×