E-Paper
Advertisement

Kiran Abbavaram: అబ్బా.. కిరణ్ అన్న మాములోడు కాదు.. ఏకంగా స్టార్ హీరోనే పట్టాడుగా

Kiran Abbavaram: అబ్బా.. కిరణ్ అన్న మాములోడు కాదు.. ఏకంగా స్టార్ హీరోనే పట్టాడుగా
Advertisement

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడానికి కిరణ్ చాలా కష్టపడుతున్నాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎదుర్కొని నిలబడుతున్నాడు.  ఈ మధ్యనే కిరణ్.. తన మొదటి సినిమా  హీరోయిన్   రహస్య గోరఖ్ ను వివాహమాడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ జంట  దేవుడి దర్శనాలలో బిజీగా మారింది.

ఇక కిరణ్ కెరీర్ సంగతికి వస్తే.. ప్రస్తుతం క అనే  సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ హీరోలే కాకుండా  కుర్ర హీరోలు కూడా ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. కిరణ్ సైతం క సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

Advertisement

సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ సరసన  నయన్ సారిక, తన్వీ రామ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాపై మలయాళ స్టార్ హీరో కన్ను పడడంతో  ఎక్కడలేని  హైప్ వచ్చేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే. వేఫేరర్ ఫిల్మ్స్ అనే పేరుతో దుల్కర్ ఒక ప్రొడక్షన్ హౌస్ ను నడుపుతున్నాడు.

Advertisement

తాజాగా క సినిమాను మలయాళంలో వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజం చెప్పాలంటే.. కిరణ్ కు ఇది మంచి అవకాశం. మాలీవుడ్ లో దుల్కర్ కు ఒక స్టార్ డమ్ ఉంది.  ఇక ఆయన బ్యానర్ లో క రిలీజ్ అవుతుంది అంటే.. కిరణ్ కు మలయాళంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.

క సినిమా  కథ విని , ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ ను చూసి .. దుల్కర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక దుల్కర్ నే ఈ సినిమా మెప్పించింది అంటే.. కథలో బలం ఉన్నట్టే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొదటి అడుగులోనే కిరణ్.. మంచి స్టార్ హీరోను బుట్టలో పడేశాడు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే క  ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×