Realme NARZO 70 Turbo 5G: రియల్ మి తన లైనప్‌లో కొత్త కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది. అందులోనూ ఇప్పడంతా 5జీ మయమైపోవడంతో ఎక్కువగా వీటిపైనే ఫోకస్ పెడుతుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లను రిలీజ్ చేస్తూ మార్కెట్‌లో ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు మోడళ్లను విడుదల చేసి గుర్తింపు సంపాదించుకున్న కంపెనీ ఇప్పుడు మరొక అద్భుతమైన ఫోన్‌తో దేశీయ మార్కెట్‌లోకి వచ్చింది. తాజాగా realme NARZO 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.
ఈ కొత్త 5G Narzo ఫోన్‌లో MediaTek Dimensity 7300 Energy ప్రాసెసర్ అందించబడింది. అలాగే 6.67-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. ఇది గరిష్టంగా 12 GB RAM + 256 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీతో కూడిన NARZO 70 Turbo 5G ఫోన్ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ IP65 రేటింగ్‌ను పొందింది. దీని ద్వారా వాటర్ అండ్ డస్ట్ వల్ల కలిగే నష్టం నుండి రక్షణనిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా ఉంది. ఇవే కాకుండా ఈ ఫోన్‌లో మరెన్నో అద్భుతమైన స్పెసిఫికేషన్లు అందించారు. ఇప్పుడు వాటితో సహా ఈ ఫోన్ వేరియంట్లు వాటి ధరల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Realme NARZO 70 Turbo 5G Specifications
realme NARZO 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 2 వేల నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంటే తడిసిన వేళ్లతో టచ్ చేసినా.. ఫోన్ డిస్ప్లే పనిచేస్తుంది. కంపెనీ డిస్‌ప్లేలో పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించింది. realme NARZO 70 Turbo 5G ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనికి 12 GB వరకు LPDDR4X RAM + 256 GB వరకు UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉంది.
Also Read: ఐక్యూ నుంచి తోపు ఫోన్.. 80W ఛార్జింగ్ సపోర్ట్ సహా అధునాతన ఫీచర్లతో వచ్చేస్తుంది!
డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. కొత్త నార్జో ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. దానితో పాటు 2 MP పోర్ట్రెయిట్ లెన్స్ అందించబడింది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్‌ల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు ఫోన్‌కు శక్తినివ్వడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Realme NARZO 70 Turbo 5G Price
realme NARZO 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 16999గా ఉంది. అదే సమయంలో 8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999.. అలాగే 12GB + 256GB వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి realme.com, Amazon.in సహా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది. మొదటి సేల్‌లో కంపెనీ ఫ్లాట్ రూ.2000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అప్పుడు ఇది మరింత తక్కువ ధరకే లభిస్తుంది.