BigTV English

Update on Kalki 2898 AD: పెద్ద ప్లానే.. ‘కల్కి 2898ఏడీ’లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Update on Kalki 2898 AD: పెద్ద ప్లానే.. ‘కల్కి 2898ఏడీ’లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Dulquer Salmaan &  Vijay Devarakonda in Prabhas ‘Kalki 2898 AD’ Movie: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ మూవీ గ్లింప్స్ టీజర్‌లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉన్నాడంటూ ఆ మధ్య కామెంట్ల వర్షం కురిపించారు.


అయితే తాజాగా మరొక గ్లింప్స్‌ టీజర్‌ని రిలీజ్ చేస్తూ అభిమానులకు మరింత ఎనర్జీని అందించారు మేకర్స్. ఇందులో అమితాబ్ బచ్చన్ లుక్‌ను రివీల్ చేశారు. అశ్వత్థామగా అమితాబ్ ఈ మూవీలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ గ్లింప్స్ బట్టి చూస్తే సినిమా రేంజ్‌ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. మాస్క్ లుక్‌లో అమితాబ్ అద్భుతంగా ఉన్నాడు.

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీలో భారీ తారగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొనే, కమల్ హాసన్, రానా వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.


Also Read: అశ్వత్థామగా అమితాబ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి గ్లింప్స్..

అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నారంటూ ఎప్పట్నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై మరొ వార్త బయటకొచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. దీంతో వైజయంతి ప్రయాణంలో ఇంతటి స్టార్ నటీ నటులు భాగం కావడం విశేషమనే చెప్పాలి. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×