BigTV English

Kohli’s No Ball Controversy: ఇంతకీ నో బాల్.. రూల్ ఏమిటి..? విరాట్ అవుట్ ఆ? నాటౌటా?

Kohli’s No Ball Controversy: ఇంతకీ నో బాల్.. రూల్ ఏమిటి..? విరాట్ అవుట్ ఆ? నాటౌటా?

Why Kohli’s Dismissal Against KKR Was Not Given a No-Ball: కోల్ కతా వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ అవుట్ నెట్టింట సెగ పుట్టించింది. అదిప్పటికి ఆగడం లేదు. ఒకరు తప్పు అంటారు, ఒకరు రైట్ అంటారు. ఒకరు ఇలా అంటారు. ఒకరు అలా అంటారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఎవరిది ఒప్పు? అనేది ఎవరూ తేల్చలేకపోతున్నారు.


ఈ సమయంలో అసలు నో బాల్ అంటే ఏమిటి? అనే చర్చ కూడా ఒకటి గట్టిగానే జరుగుతోంది. ఎందుకంటే విరాట్ అవుట్ అయి బయటకు వచ్చాడు. వచ్చి వీడియోల్లో చూసుకున్నాడు. అయినా సరే, తను కన్విన్స్ కాలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అంపైర్ వస్తే, తనతో మళ్లీ వాగ్వాదం పెట్టుకున్నాడు.

అంపైర్ ఎంత చెప్పినా సరే, తన మాట వినలేదు. తనెలా నిలుచున్నాడు? బాల్ ఎలా వెళ్లిందనేది మళ్లీ యాక్షన్ చేసి చూపించాడు. ఈక్రమంలో అసలు నో బాల్ అంటే ఏమిటి? అనే అంశంపై రూల్ బుక్ ఏం చెబుతుందనేది ఒకసారి చూద్దాం.


Also Read: అంపైర్ తో వాగ్వాదం.. డస్ట్ బిన్ పై కోపాన్ని చూపించిన విరాట్

అధికారిక రూల్ బుక్ ప్రకారం విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. నడుం ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో బాల్ వెళితే,  నో బాల్ ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే, విరాట్  కొట్టినప్పుడు, బంతి నడుం ఎత్తులోనే ప్రయాణిస్తోంది.  కానీ, బంతి స్టెపింగ్ క్రీజ్‌ను దాటుతున్నప్పుడు, హైట్ తగ్గిపోయింది. దాంతో అది కరెక్ట్ బాల్ గా మారిపోయింది.

నిజానికి నో బాల్ ఇవ్వాలంటే రూల్ ప్రకారం కొహ్లీ నడుం నుంచి 1.04 మీటర్లు హైట్ పై ప్రయాణించాలి. కానీ బంతి గమనం తన నడుం దగ్గరికి వచ్చేసరికి 0.92 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే కొహ్లీ నడుంకి ఇంకా 0.12 మీటర్ల దిగువన ఉంది.  అందుకే థర్డ్ అంపైర్ నో బాల్ కాదని, ఫుల్ టాస్ బాల్ అవుట్ అని తేల్చాడు.

Also Read: Yuzvendra Chahal: ఐపీఎల్ తొలి బౌలర్ గా చాహల్.. 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ గా రికార్డ్

ఈ వివాదానికి ప్రధాన కారణం థర్డ్ అంపైర్ చూపిన హాక్ ఐ పిక్చర్  అనే అంటున్నారు. కొహ్లీ బ్యాటింగ్ పొజిషన్ చూపించి, బంతి గమనాన్ని ఒక మోషన్ లో స్ట్రయిట్ యాంగిల్ లో చూపిస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని అంటున్నారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×