E-Paper
Advertisement

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
Advertisement

K.Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడంతో సినీలోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు కున్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఒక సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

అత్యంత ఆప్తులు, పితృసమానులు, గురుతుల్యులు కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారు లేరనే మాట తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని.. ఆర్ట్ ఫిల్మ్స్‌ను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని వెల్లడించారు. నేటి యువ దర్శకులకు ఆయన సినిమాలు ఒక గ్రంధాలయమని.. తమ లాంటి నటులకు ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా అని తెలిపారు. అటువంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేయడం తన అదృష్టమని చెప్పారు.

‘‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తం రుణపడి ఉంటాము సర్’’ అని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

Advertisement

కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతిపట్ల టీడీపీ నేత నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. ఆయన కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్దర్శకుడు దివంగతులవడం బాధాకరం అని తెలిపారు.

లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్‌గారు లేరంటే షాకింగ్‌గా ఉందని నటుడు వెంకటేష్ అన్నారు. ఈ జనరేషన్ మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలు కూడా ఆయన సినిమాలను గుర్తు పెట్టుకుంటాయని అన్నారు. స్వర్ణకమలం సినిమా సందర్భంగా ఉన్నో విషయాలు నేర్పారు అని చెప్పారు. వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×