BigTV English

South Africa:పాటలో కుమ్మేశారు.. ఆటలో బోల్తాపడ్డారు..

South Africa:పాటలో కుమ్మేశారు.. ఆటలో బోల్తాపడ్డారు..

South Africa:ఓ సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆటకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్లు… అదే జోష్ మైదానంలో చూపించలేకపోయారు. టీ-20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టీ-20 ట్రై సిరీస్‌ ఫైనల్లో… దక్షిణాఫ్రికా మహిళల చేతిలో ఓడిపోయారు.


ఫైనల్ మ్యాచ్‌కు ముందు… విశాల్ హీరోగా వచ్చిన ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ పాట​కు భారత మహిళా క్రికెటర్లు అదిరిపోయే స్టెప్పులేశారు. జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా సహా ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… దాన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి… ‘స్లేయింగ్‌ ది ట్రెండ్‌’ అనే క్యాప్షన్‌ జత చేసింది. దాంతో… టీ-20 ప్రపంచకప్‌కు ముందు మహిళా క్రికెటర్లు ఫుల్ జోష్ మీద ఉన్నారని… అదే జోష్ ఆటలోనూ చూపి ట్రోఫీ నెగ్గాలని అభిమానులు కామెంట్ చేశారు. అయితే… ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టీ-20 ట్రై సిరీస్‌ ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓడిపోవడం… అందర్నీ నిరాశ పరిచింది.

ట్రై సిరీస్ లీగ్‌ దశలో అద్భుతంగా ఆడిన భారత మహిళా క్రికెట్ జట్టు… ఫైనల్లో బ్యాటింగ్ సరిగ్గా చేయలేక ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌… 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో… భారత టాపార్డర్ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. ఎనిమిది బంతులాడిన స్మృతి మంధాన డకౌట్‌ కాగా, మరో ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ 11 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. హర్లీన్‌ డియోల్‌ 56 బంతుల్లో 46 రన్స్ చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22 బంతుల్లో 21 రన్స్ చేసింది. చివర్లో దీప్తి శర్మ 14 బంతుల్లో 16 పరుగులు చేసి… జట్టు స్కోరును వంద పరుగులు దాటించింది.


ఛేజింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా టీమ్… భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దాంతో.. భారత అమ్మాయిలు అద్భుతం చేస్తారేమోనని చాలా మంది ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ… క్లో ట్రైఆన్ 32 బంతుల్లో 57 రన్స్ చేసి భారత జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. ఆమె ధాటిగా బ్యాటింగ్ చేయడంతో… దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డ్ ఆమెకే దక్కగా… భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచింది. ఇక… ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలోనే మహిళల టీ-20 వరల్డ్‌ కప్‌ జరగనుంది.

Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..

Naseem Shah:బాడీ షేమింగ్.. పాక్ పరువు తీసిన నసీం షా!

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×