E-Paper
Advertisement

Eagle: సెన్సార్ పూర్తి.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే..

Eagle: సెన్సార్ పూర్తి.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే..
Advertisement
Eagle Movie Update

Eagle Movie Update(Telugu film news):

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండబోతోంది. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అందులో మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ‘ఈగల్’ ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్‌లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌‌‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకి సంబంధించిన పలు విషయాలను పంచుకుంటుంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా చిత్రబృందం కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు ఎటువంటి కట్ లేకుండా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది రవితేజ ఫ్యాన్స్‌కి మంచి విశేషమనే చెప్పాలి.

Advertisement

ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న పలు సినిమాలు ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్నాయి. ఇక ఈగల్ సినిమా జనవరి 13న రిలీజ్ అవుతుండగా.. అదే రోజున వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ కూడా విడుదల కానుంది. దానికి ముందు రోజు జనవరి12న గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. జనవరి 14న నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ రిలీజ్ అవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×