BigTV English

Chandrababu Chit Chat: 80 శాతం అభ్యర్థుల లిస్ట్ రెడీ.. ప్రకటించేది అప్పుడే : చంద్రబాబు నాయుడు

Chandrababu Chit Chat: 80 శాతం అభ్యర్థుల లిస్ట్ రెడీ.. ప్రకటించేది అప్పుడే : చంద్రబాబు నాయుడు
Chandrababu naidu news today

Chandrababu naidu news today(Latest andhra news in telugu):

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే ధ్యేయంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ నుంచి రావటానికి చాలా మంది సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.


ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని.. దాదాపుగా 70, 80 శాతం అభ్యర్థుల జాబితా పూర్తి అయిందని తెలిపారు. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని అన్నారు. బీజేపీతో పొత్తుపై ఇంకా సంప్రదింపులు జరపలేదని.. అధికార పార్టీ పెట్టిన ఇబ్బందులని ఎదుర్కొని లోకేష్ పోరాటం చేస్తున్నారన్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో డీకే శివకుమార్ ని అనుకోకుండా కలిసినట్లు వెల్లడించారు.

కేసీఆర్ సలహాల కోసం నేను వెళ్ళాను అనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు జగన్ వెళ్తున్నారని అన్నారు. వారి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు తెలంగాణతో పోటీపడి పరిశ్రమలు తెచ్చుకున్నామని.. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏపీలో సున్నా పరిశ్రమలు అంటూ మండిపడ్డారు. జగన్ ఓడిపోతే చెన్నై పోతారని అన్నారు. సౌత్ లో కాంగ్రెస్ కి కింగ్ మేకర్ రేవంత్ రెడ్డి అని.. ఏపీ పరిస్థితి బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ ఏపీ ఎన్నికలపై వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయని, ఏపీని గాడిలో పెట్టాలని చంద్రబాబు తెలిపారు.


.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×