E-Paper
Advertisement

Patancheru : భార్యను కాపురానికి పంపట్లేదని దారుణం.. అత్త హత్య.. అడ్డొచ్చిన భార్యపై ?

Patancheru : భార్యను కాపురానికి పంపట్లేదని దారుణం.. అత్త హత్య.. అడ్డొచ్చిన భార్యపై ?
Advertisement

Patancheru : ఇస్నాపూర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కాపురానికి పంపట్లేదన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన భార్యపై కూడా అదే కత్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ సంఘటనలో అత్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లోని పద్మారావు కాలనీలో ఉండే శాంతమ్మ(40) తన కుమార్తె సత్యవతి(22)ని రుద్రవరానికి చెందిన సాయిబాబా (26)కు ఇచ్చి వివాహం జరిపించింది. ఇటీవల దంపతుల మధ్య గొడవలు కావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. రోజులు గడుస్తున్నా సత్యవతి తిరిగి కాపురానికి రాలేదు. తన భార్య సత్యవతిని అమె తల్లి శాంతమ్మే కాపురానికి పంపడం లేదని సాయిబాబా కోపం పెంచుకున్నాడు. భార్యకోసం అత్తగారింటికి వెళ్లినట్లే వెళ్లి.. శాంతమ్మను కత్తితో పొడిచి చంపాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోశాడు.

Advertisement

అనంతరం సాయిబాబా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న సత్యవతిని, అమె తల్లి శాంతమ్మను స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శాంతమ్మ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం సత్యవతికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×