Actor Prabhas & Actress Payal Rajuput Posts Goes Viral Social Media: “డార్లింగ్స్.. కాస్త వెయిట్ చేయండి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ మన జీవితంలోకి వస్తున్నారు. త్వరలోనే చెప్తా” ఇది ప్రభాస్ ఈ రోజు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన స్టోరీ. ఈ ఒక్క స్టోరీతో ప్రభాస్ పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. వదినమ్మ వచ్చేస్తుందంటూ ఫ్యాన్స్ హడావిడి షురూ అయింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ప్రభాస్ ఇన్ స్టా స్టోరీ కంటే ముందు.. ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరుతో ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది.
ఆ పోస్ట్ లో నేను ఖచ్చితంగా ఒక డార్లింగ్ ని. మీరు గెస్ చేయగలరా అని ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేసి 12 గంటలవుతోంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభాస్ ఇన్ స్టా స్టోరీ తో ఆ పోస్ట్ ని కలిపి ఒక ఇన్ స్టా హ్యాండిల్ మీమ్ తయారు చేసి పోస్ట్ చేసే సరికి.. నెటిజన్లంతా ఆ అకౌంట్ ను వెతికి, అందులో ఉన్న పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు.
అంటే ప్రభాస్ అన్న చెప్పిన ఆ సమ్ వన్ స్పెషల్ నువ్వేనా ఏంటి ? అంటూ నెటిజన్లు, డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. అన్నా.. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలాంటి షాకులు మాత్రం ఇవ్వకన్నా అంటూ.. పాయల్ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తే అనుష్క ఏమైపోతుందంటూ.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు. కొందరైతే ప్రభాస్ స్టోరీకి దీనికి సంబంధం లేదంటున్న.. ఎక్కడో తేడాగా ఉందని అనుకుంటున్నారు. అయినా ఈ ఖాతాకు బ్లూ టిక్ లేదు. ఇది నిజంగా పాయల్ అకౌంటేనా అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Prabhas: అంత ఏం లేదు డార్లింగ్స్.. మళ్లీ ప్రభాస్ మోసం చేశాడు.. ?
వీరిద్దరూ కలిసి ఇంతవరకూ ఒక్క సినిమా చేయలేదు. బహుశా ప్రభాస్ నెక్ట్స్ మూవీలోనో చేస్తున్న సినిమాల్లోనో పాయల్ కు ఒక క్యారెక్టర్ ఉండి ఉండొచ్చేమో.. అందుకే ఇద్దరూ అలా పోస్ట్ చేసి ఉంటారని ఇంకొందరు కామెంట్లు పెట్టారు. ఏదేమైనా వీరిద్దరి పోస్టు, స్టోరీ వెనుక ఉన్న అర్థమేంటో తెలియాలంటే.. ప్రభాస్ అసలు మేటరేంటో చెప్పే వరకూ ఆగాల్సిందే.
Also Read: వెయిట్ చేయండి డార్లింగ్స్.. మంచి న్యూస్ చెప్తానన్న ప్రభాస్.. పెళ్లి అప్డేటా..?
I’m someone’s darling for sure ! 🥹
Any guesses ? 😎 pic.twitter.com/pOzjDFIVvm— paayal rajput (@starlingpayal) May 16, 2024