BigTV English

BMW X3 XDrive20d M Sport Shadow Edition: అదిరిపోయే ఫీచర్లతో BMW కొత్త ఎడిషన్ లాంచ్.. స్పెసిఫికేషన్లు కెవ్వ్ కేక!

BMW X3 XDrive20d M Sport Shadow Edition: అదిరిపోయే ఫీచర్లతో BMW కొత్త ఎడిషన్ లాంచ్.. స్పెసిఫికేషన్లు కెవ్వ్ కేక!

BMW X3 XDrive20d M Sport Shadow Edition Launched in India: ప్రపంచ ఆటో మార్కెట్‌లో BMWకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కార్ల ధరలు ఏ రేంజ్‌లో ఉన్నా కొనేందుకు ఆలోచించరు. అయితే ధర మాత్రమే కాదు.. ఇందులోని ఫీచర్లు కూడా హై రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసేవారు.. ఈ కార్లలో ఉంటే ఫీచర్లను చూసే ఆకర్షితులవుతుంటారు.


అయితే ఈ బిఎండబ్ల్యూ నుంచి తాజాగా మరొక అద్భుతమైన కార్ భారతదేశంలో లాంచ్ అయింది. ప్రపంచంలోని ప్రఖ్యాత కార్ల తయారీదారులలో ఒకటైన BMW భారతదేశంలో BMW X3 xDrive20d M స్పోర్ట్ షాడో ఎడిషన్‌ను విడుదల తాజాగా విడుదల చేసింది.

ఈ ఎడిషన్ భారతదేశంలో రూ. 74.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరలో లాంచ్ అయింది. అంతేకాకుండా ఈ వెర్షన్ xDrive20d M స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అదనంగా ఈ ఎడిషన్ అనేక ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో హై గ్లోస్ బ్లాక్ విండో గ్రాఫిక్, టెయిల్ పైప్స్, రూఫ్ రైల్స్, కిడ్నీ గ్రిల్, కిడ్నీ ఫ్రేమ్, బార్‌లు వంటివి ఉన్నాయి.


Also Read: బిఎమ్‌డబ్ల్యూ నుంచి రంగులు మార్చే కారు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

దీనితో పాటు ఇది 19 అంగుళాల Y-స్పోక్ 887 M అల్లాయ్ వీల్స్‌తో అందించబడింది. ఈ ఎడిషన్‌లో BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0తో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంది. అలాగే 3D నావిగేషన్ సపోర్ట్ వైర్‌లెస్ Apple CarPlay‌తో వస్తుంది. Android Auto వంటి ఫీచర్లు ఈ వాహనంలో అందుబాటులో ఉన్నాయి.

ఇక ఈ ఎడిషన్ పనితీరు విషయానికొస్తే.. BMW కొత్త ఎడిషన్ 2L 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు ఈ వాహనం 8-స్పీడ్ ఆటోమేటిక్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడింది. ఇది 190bhp, 400 Nm టార్క్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Also Read: Maruti Suzuki Swift vs Hyundai Grand i10 Nios: ఈ రెండిటిలో ఏ కారు కొనాలి..? ఫీచర్ల పరంగా ఏది బెటర్..?

ఈ ఎడిషన్ కేవలం 7.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 213 kmph అని కంపెనీ పేర్కొంది. ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags

Related News

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

Big Stories

×