
Pawan OG Movie : పవన్ , సుజిత్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ ఫుల్ రేంజ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ నటించిన బ్రో చిత్రం ఊహించని సక్సెస్ సాధించడంతో రాబోయే అతను చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు సినిమాలతో.. అటు రాజకీయాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించిన షూటింగ్ 60 శాతం పైగానే పూర్తయిందని తెలుస్తోంది. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ మూవీస్ అంటే థమన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడమే కాకుండా పాటలను ఓ రేంజ్ లో ఉండేలా చూస్తాడు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అది ఈ మూవీలో కనిపించబోతున్న విలన్ పాత్రకు సంబంధించినది. ఈమధ్య వచ్చిన టైగర్- 3 చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన విలన్ గా బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఎంతో బాగా నటించాడు. ఇప్పుడు పవన్ పక్కన కూడా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లో విలన్ గా ఇమ్రాన్ హష్మీ చేయబోతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో పవన్ .. ఇమ్రాన్ మధ్య హై ఇంటెన్సిటీ సీన్లు ఉంటాయి అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలి అంటే ఈ మూవీలో హీరోతో సమానమైన పవర్ ఫుల్ గా విలన్ పాత్ర ఉంటుందట.ఇక ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇంకా ఓజీ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. త్వరలోనే మేకర్స్ దీని గురించి అనౌన్స్ చేసి అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ అవి పూర్తయిన వెంటనే తదుపరి షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ప్రస్తుతం మార్కెట్లో పవన్ సినిమాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మార్కెట్ వాల్యూ కూడా ఈ చిత్రాలకు భారీగా ఉంటుంది .పైగా అభిమానులు పవన్ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.