BigTV English

Mayank Yadav: మయాంక్ ఒక్కడు చాలు.. సీనియర్ల ప్రశంసలు

Mayank Yadav: మయాంక్ ఒక్కడు చాలు.. సీనియర్ల ప్రశంసలు

 Mayank Yadav Latest Sports NewsMayank Yadav in IPL 2024(Sports news headlines): మయాంక్ యాదవ్.. భారత భవిష్యత్ ఆశా జ్యోతిగా కనిపిస్తున్నాడు. టీ 20లో లఖ్ నవ్ తరఫున ఆడుతున్న ఈ యువ పేసర్ ఒక్కడు ఒంటిచేత్తో రెండు మ్యాచ్ లను గెలిపించడం విశేషం. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఫాస్టెస్ట్ బౌలర్ గా అవతరించిన మయాంక్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బిషప్ మాట్లాడుతూ 150 ప్లస్ వేగంతో బాల్స్ సంధించడం నిజంగా అద్భుతమని తెలిపాడు. బీసీసీఐ వెంటనే స్పందించి అతనికి కాంట్రాక్ట్ ఇవ్వాలని సూచించాడు. అలాగే వచ్చే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో తనని చేర్చాలని సూచించాడు. నేనేగానీ అక్కడే ఉండి ఉంటే, ఇన్ని మీన మేషాలు లెక్క పెట్టేవాడిని కాదని అన్నాడు. అతన్ని గమనించడానికి ఇంతకుమించిన ప్రదర్శన అవసరం లేదని సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టాడు.

Also Read: రోహిత్ శర్మ ఐపీఎల్ ఖాతాలో ఒక చెత్త రికార్డ్..


మాజీ క్రికెట్ ప్లేయర్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. మయాంక్ యాదవ్ కు భారత క్రికెట్ లో మంచి భవిష్యత్ ఉందని అన్నాడు. తను ఇదే ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో సూపర్ స్టార్ అవుతాడని అన్నాడు. మయాంక్ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నాడు. తనలో ఎంతో గొప్ప టాలెంట్ ఉందని ప్రశంసల జల్లు కురిపించాడు.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా మయాంక్ బౌలింగ్ ని ప్రశంసించాడు. 155 కిమీ వేగంతో అతను బాల్స్ వేస్తుంటే నిలువరించడం చాలా కష్టమని అన్నాడు.

ఎందుకంటే మన కళ్లు అంతవేగాన్ని పసిగట్టి, మన మెదడుకు సంకేతాలిచ్చి, అవి క్షణాల్లో మన బ్యాటింగ్ పొజిషన్ కి పంపించి, మన శక్తిని కూడగట్టుకుని అప్పటికప్పుడు క్షణంలో వెయ్యో వంతులో షాట్ కొట్టడమా లేక డిఫెన్స్ ఆడటమా తెలుసుకునేలోపే మయాంక్ బాల్ వికెట్లను ఎగరగొడుతోందని అన్నాడు.

ఇది నిజంగా అద్భుతమనే చెప్పాడు. కాకపోతే ఫాస్ట్ బౌలర్స్ కెరీర్ నిలకడగా ఉండదు. తనిలాగే ఇదే ఫిట్ నెస్ తో, ఇదే వేగంతో కొనసాగితే మాత్రం రాబోవు రోజుల్లో మరో సూపర్ స్టార్ అవుతాడని అన్నాడు.

ఇలా ప్రతీ ఒక్కరు ప్రశంసలు కురిపించడంతో ప్రపంచం  ఫోకస్ అంతా ఒక్కసారి మయాంక్ యాదవ్ పై పడింది. ఇక నుంచి తను ఆడే ప్రతి ఆట ప్రత్యేకమైనదేనని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×