BigTV English
Advertisement

Akkineni Nagarjuna: క్లాస్ మెచ్చిన మన్మధుడు.. మాస్ మెచ్చిన బాస్ ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున

Akkineni Nagarjuna: క్లాస్ మెచ్చిన మన్మధుడు.. మాస్ మెచ్చిన బాస్ ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున

Evergreen Hero Akkineni Nagarjuna Birthday special article: ఆయనను చూస్తే ఎవరికైనా జెలసీ.. అరవై ఆరేళ్ల వయసులోనూ ఇరవై ఆరేళ్ల యువకుడిలా కనిపించడమే ఆయన స్పెషల్. అమ్మాయిలు మెచ్చిన మన్మథుడు నాలుగు దశాబ్దాలుగా వయసు పెరగని నిత్య యవ్వనుడు.. ఆయనే నవరస నట సామ్రాట్ అక్కినేని నాగార్జున. అక్కినేని, నందమూరి కుటుంబాలు అప్పట్లో సినీ పరిశ్రమను శాసించే స్థాయిలో ఉన్నాయి. ఇండస్ట్రీ టాప్ హీరోలు అనగానే ఎన్టీఆర్, ఎఎన్ఆర్ అనేవారు. అలాంటి నట వంశం అక్కినేని కుటుంబ హీరోగా తెరంగేట్రం చేశారు నాగార్జున. ఆయన నటించిన తొలి చిత్రం విక్రమ్. అది 1986లో విడుదలయింది. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు.. అభిమానులకు పండుగ రోజు.


ఆర్జీవీని పై నమ్మకం

కమర్షియల్ సక్సెస్ అందుకుంది. హిందీలో జాకీష్రాఫ్ నటించిన హీరో సినిమాకు రీమేక్ ఇది. తొలి చిత్రం హిట్ రేంజ్ అందుకున్నా ఆ తర్వాత వరుసగా నాగ్ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. తర్వాత వచ్చిన మజ్నూ మూవీలో భగ్న ప్రేమికుడిగా నటించి మెప్పించారు. అయితే నాగ్ కేవలం లవర్ బాయ్ పాత్రలకే పరిమితం కాదలచుకోలేదు. అందుకే ఆఖరి పోరాటం, శివ లాంటి మాస్ యాంగిల్ సినిమాలలోనూ నటించారు. ప్రయోగాలు చేశారు. అందులో అపజయం ఎదురైనా కుంగిపోలేదు. రామ్ గోపాల్ వర్మతో శివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ.. తానే నిర్మాతగా తీశారు. అయితే ఈ సినిమాపై చాలా మంది నాగ్ ను నిరుత్సాహపరిచారు. కాలేజీ గొడవల మీద సినిమా ఏంటని.. అయినా నాగార్జున రామ్ గోపాల్ వర్మ మీద ఉన్న నమ్మకంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ మూవీ చేశారు. విజయవాడ కాలేజీ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్వీయ అనుభవాలను జతచేసి ఆ మూవీని డైరెక్ట్ చేశారు.


ట్రెండ్ సెట్టింగ్ మూవీ

శివ మూవీ తెలుగు సినిమా పరిశ్రమలోనే ఓ ట్రెండ్ సెట్టింగ్ గా మారిపోయింది. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా కలెక్షన్లు వసూలు చేసింది. అన్నపూర్ణ బ్యానర్ ని ఆకాశంలో నిలబెట్టింది. ఈ మూవీలో నాగార్జున ఫుల్ మాస్ హీరోగా చేతిలో చైన్ పట్టుకుని ప్రత్యర్థులను దడదడలాడించారు. ఈ మూవీ కలెక్షన్ల కనక వర్షమే కాదు అవార్డుల పంట కూడా పండించింది. ఏకంగా మూడు నంది అవార్డులను దక్కించుకుంది. దర్శకత్వ విభాగం, డైలాగ్ విభాగం నుంచే కాకుండా బెస్ట్ ఫిలిం అవార్డును కూడా దక్కించుకోవడం విశేషం. ఇక అన్నమయ్య గురించి తెలిసిందే. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ తో భక్తిరస చిత్రం ఏమిటని విమర్శించిన నోళ్లకు తన శిఖరాగ్ర నటనతో మరోసారి మెప్పించారు నాగ్. అన్నమయ్య మూవీకి రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుంది. ఒక నటుడు అంటే ప్రత్యేకంగా ఒకటే కేటగిరీకి గిరిగీసుకుని కూర్చోకూడదని నాగ్ నటించిన సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది.

కొత్త దర్శకులతో ప్రయోగాలు

నాగ్ తన నటనా కెరీర్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది నూతన దర్శకులకు అవకాశం ఇచ్చారు. అన్నపూర్ణ సంస్థకు చెందిన అనేక బిజినెస్ లావాదేవీలు దగ్గరుండి చూసుకుంటూ తన ఇద్దరు కుమారులను కూడా హీరోలుగా చేశారు. శివ చిత్రంలో తన సహనటి అమలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటని అందరూ ఆసక్తిగా అడుగుతుంటారు పలు మీడియా సమావేశాలలో అందుకు ఆయన చెప్పేది ఒకటే. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. శారీరక వ్యాయామం చేయడం అంటుంటారు. వంద సినిమాలు పూర్తిచేసుకున్న నాగార్జున బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో లోనూ మెప్పిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×