E-Paper
Advertisement

Family Star: ఫ్యామిలీ స్టార్ సెన్సార్.. కొండన్న సినిమాలో బూతులు ఉండాల్సిందే.. ?

Family Star: ఫ్యామిలీ స్టార్ సెన్సార్.. కొండన్న సినిమాలో బూతులు ఉండాల్సిందే.. ?
Advertisement

Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాకి హైప్ పెంచేస్తున్నారు.

Advertisement

గత వారం రోజులుగా విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఆక్రమించేశాడు. ఎక్కడ చూసినా కొండన్ననే కనిపిస్తున్నాడు. బుల్లితెర, సోషల్ మీడియా అని తేడా లేకుండా ప్రమోషన్స్ ఇచ్చిపడేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే పెట్టుకున్నారు అభిమానులు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు కట్స్ ఏమి లేకుండా U/A ఇచ్చారు. 163 నిమిషాలు అనగా రెండు గంటల 43 నిమిషాల నిడివితో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఇవన్నీ ఓకే కానీ, ఈ సినిమాలో బూతులు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. అర్జున్ రెడ్డి లో మాట్లాడిన బూతులు కంటే ఇందులో దారుణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక వాటిని సెన్సారి మ్యూట్ చేసింది. f*ck పదాలు రెండు చోట్ల ఉపయోగించగా.. వాటిని మ్యూట్ చేసింది. ఇక తెలుగులో కూడా దారుణమైన బూతులు ఉన్నాయి.. ముండ, మాధచూర్ పదాలతో పాటు మరో రెండు బూతులకు సెన్సార్ మ్యూట్ ఇచ్చింది. ఇది కాకుండా సాంగ్ లో లిక్కర్ బాటిల్స్ కు బ్లర్ వేసినట్లు తెలిపింది. మొత్తానికి ఫ్యామిలీలు చూసే సినిమాలో బూతులు కూడా గట్టిగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు కొండన్న సినిమాలో బూతులు లేకపోతే ఆశ్చర్యపోవాలి అని కామెంట్స్ పెడుతున్నారు.  మరి ఈ సినిమా విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×