Realme 12x 5G : దేశంలోని ప్రముఖ టెక్ బ్రాండ్ కంపెనీ రియల్ మీ. బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయడంలో దీనికి మించింది లేదు. ఇకరకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రియల్ మీ ఏంట్రీ ఇచ్చాకే.. ఇది వరకు ఆకాశంలో ఉన్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దిగొచ్చాయి. అధికంగా ఉన్నా ధరలను ఒక్కసారిగా తగ్గించాయి. దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఫోన్లలో రియల్ మీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంటుంది. రియల్ మీ తక్కువ మిడ్ రేంజ్ ప్రైజ్ సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లను తీసుకొస్తుంటుంది.
ఈ నేపథ్యంలోనే రియల్ మళ్లీ తన మార్క్‌ను చూపించింది. రియల్ మీ 12 సిరీస్‌లో తన లెటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Realme 12X 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ రియల్ మీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన Realme 12 సిరీస్‌లో అత్యంత చీపెస్ట్ మొబైల్‌గా నిలిచింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 5న ప్రారంభం కానుంది.
Also Read : వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!
Realme 12X 5G స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.2 ఇంచేస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.ఇది హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. 120 హెచ్జెడ్ రీఫ్రెష్‌రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రియల్ మీ యూఐ 5.0తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అందులో 4GB RAM + 128GB, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే.. Realme 12X 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ప్రైమరీ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కాగా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. ఫోన్ ముందు భాగంలో అద్భుతమైన సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది.
Realme 12X 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ పవర్ ఫుల్, బిగ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP54 ఫీచర్‌తో దుమ్ము, నీరు నుంచి ఫోన్‌కు ప్రొటక్షన్ ఇస్తుంది.
Also Read : కొత్త ఫోన్ కోనాలనుకుంటున్నారా..? ఏప్రిల్‌లో లాంచ్ కానున్న మొబైల్స్ ఇవే.. ఓ లుక్కేయండి!
Realme 12X 5G ధర గురించి చెప్పాలంటే.. ఇందులో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11999గా ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 13,499గా పేర్కొంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ధారించింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.1000 తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌ను రియల్ మీ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి,ఫ్లిప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.