E-Paper
Advertisement

Family Star in OTT: మూడు వారాలకే ఓటిటీ బాట పట్టిన ఫ్యామిలీ స్టార్!

Family Star in OTT: మూడు వారాలకే ఓటిటీ బాట పట్టిన ఫ్యామిలీ స్టార్!
Advertisement

Vijay Devarakonda’s Family Star Streaming in OTT: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్యనే థియేటర్ కు వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. గీతగోవిందం కాంబో మళ్లీ రిపీట్ అవుతుంది అనుకున్నా .. అది వర్క్ అవుట్ అవ్వలేదు. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం కలక్షన్స్ పరంగా కూడా తక్కువే అందుకుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా తాజాగా ఓటిటీ బాట పట్టింది. మూడు వారాలు కూడా కాకముందే ఫ్యామిలీ స్టార్ ఓటిటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అమెజాన్ ఫ్యామిలీ స్టార్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అయితే ఇందులో ఒక మతలబు కూడా ఉందని సమాచారం. ఏప్రిల్ 26 నుంచి ఈ చిత్రం రెంట్ పద్దతిలో రస్ట్రీమింగ్ కానుందని, మే 3 నుంచి ఫ్రీగా చూడొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: The Goat Life OTT: ఓటీటీలోకి లేటెస్ట్ రూ.150 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

ఇకపోతే ఫ్యామిలీ స్టార్ కథ విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్. ఇద్దరు అన్నలు పనిలేకుండా ఉండడంతో కుటుంబ భారమంతా తన భుజాన వేసుకుంటాడు. గోవర్ధన్ ఇంటిపైకి ఇందు అనే ఒక అమ్మాయి అద్దెకు వస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఆ ప్రేమ వెనుక దాగున్న రహస్యాన్ని గోవర్ధన్ తెలుసుకొని షాక్ అవుతాడు. ఇందు పై కోపంతో గోవర్ధన్ ఏం చేశాడు.. ? చివరికి వీరిద్దరూ కలిశారా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో సందడి చేయని ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×