BigTV English

The Goat Life OTT Release: ఓటీటీలోకి లేటెస్ట్ రూ.150 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

The Goat Life OTT Release: ఓటీటీలోకి లేటెస్ట్ రూ.150 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

The Goat Life OTT Date Confirmed: ఒకప్పుడు మలయాళ సినిమాలు రూ.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలంటే ఎంతో గగనం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అలవోకగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టేస్తున్నాయి. అంతేకాకుండా తెలుగులో వెర్షన్‌లో కూడా రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందులో ముందు వరుసలో ‘ది గోట్ లైఫ్’ మూవీ ఒకటి.


ఈ మూవీ తెలుగులో ‘ఆడుజీవితం’ పేరుతో రిలీజ్ అయింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కథానాయకుడిగా నటించి అదరగొట్టేశాడు. ఈ మూవీని తెరకెక్కించేందుకు మూవీ టీం దాదాపు 16ఏళ్లు కష్టపడింది. కరోనా కష్టకాలంలో కూడా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. ఇన్ని ఏళ్ల కష్టానికి ప్రతిఫలం మార్చి 28న లభించింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 28న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు పెట్టారు. దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వారి 16ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించింది.


Also Read: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..

ఇటీవలే ఈ మూవీ 25 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దులిపేసింది. దీంతో మలయాళంలో ఇప్పటి వరకు భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల్లో ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం’ చేరిపోయింది. ఇక థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్‌తో అదరగొడుతున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారికి తాజాగా ఓ న్యూస్ ఫుల్ ఎనర్జీని అందించింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురి ఒప్పందం ప్రకారం.. ఈ మూవీ విడుదలైన 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే ఈ మూవీ మే 10న గ్రాండ్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×