Big Stories

Moto G64 5G Sale : మోటో G64 5G సేల్ స్టార్ట్.. ఫీచర్లు చూస్తే అవాక్కవుతారు!

Moto G64 5G Sale : టెక్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా 5G సెగ్మెంట్‌లో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 14న స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ తీసుకురాగా నేడు అనగా ఏప్రిల్ 24న సేల్‌కు తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్  కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా ఈ 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే ఫోన్ ఫీచర్లు, ధర తదితర విషయాలను తెలుసుకోండి.

- Advertisement -

మోటో తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గత వారం లాంచ్ చేసిన ఫోన్‌ను ఏప్రిల్ 24న సేల్‌కు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో అనేకమైన ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ మోటరోలా ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కాకుండా మీరు ఈ ఫోన్‌ను 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో చూడొచ్చు.

- Advertisement -

Also Read : 108 MP కెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 600 లకే.. ఫ్రీగా వాచ్ కూడా!

ఇందులోని MediaTek Dimension 7025 చిప్‌సెట్ ప్రాసెసర్ ఫోన్‌కు వేగాన్ని మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగపడుతుంది. మొబైల్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్, 8MP మాక్రో డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలానే ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరా సెన్సార్ ఉంది.

కనెక్టవిటీ కోసం ఫోన్‌లో 5G సపోర్ట్, డ్యూయల్-సిమ్ సపోర్ట్, USB టైప్-సి పోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ వెర్షన్ 5.2, GPS మరియు 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి. మోటో G64 5G అనేది MediaTek Dimension 7025 ప్రాసెసర్‌తో ప్రారంభించబడిన మొదటి మొబైల్. ఇది కాకుండా మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం ఈ బడ్జెట్ ఫోన్‌లో డాల్బీ అట్మోస్‌ను కూడా ఉంది.

Also Read : రేపే రియల్ మీ ఎర్లీ బర్డ్ సేల్.. 2 గంటలు మాత్రమే!

Moto G64 5G ధర విషయానికి వస్తే మొబైల్ రెండు వేరియంట్‌లు ఉన్నాయి. 8GB+128GB వేరియంట్ ధర రూ. 14,999. 12GB RAM+256GB కలిగిన టాప్ వేరియంట్ కోసం మీరు రూ.16,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI ద్వారా రూ. 1000 తగ్గింపు పొందొచ్చు. అదే సమయంలో మీరు HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా EMI  ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ. 1100 ప్రయోజనం పొందుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News