E-Paper
Advertisement

Family Star Trailer: విజయ్ తప్పు చేసి కాళ్లు పట్టుకున్నది ఎక్కడో తెలుసా.. ?

Family Star Trailer: విజయ్ తప్పు చేసి కాళ్లు పట్టుకున్నది ఎక్కడో తెలుసా.. ?
Advertisement

vijay devarakonda new movie update

Family Star Trailer update(Cinema news in telugu): రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి గోవర్ధన్. అన్న, అక్క, వదిన, బామ్మ వారి పిల్లలతో కలిసి ఉంటాడు. ఇక వారి ఇంటిపై గదిలోకి ఇందు అద్దెకు వస్తుంది. ఇక మొదటి చూపులోనే ఇందు ప్రేమలో పడిన గోవర్ధన్.. ఆమె ప్రేమను పొందడానికి ఏం చేశాడు.. ? అసలు ఇందు ఎవరు.. ?  ఒక మిడిల్ క్లాస్ యువకుడు.. తన కుటుంబానికి ఆపద వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ది ఫ్యామిలీ స్టార్ కథ అని తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ చూసాక.. గీతగోవిందం గుర్తుకురాక మానదు. అందులో గోవింద్ అయితే.. ఇందులో గోవర్ధన్ అంతే తేడా. అందులో ఉన్న బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీనే ఇందులో కూడా వాడాడు విజయ్. ఇక ఈ ట్రైలర్ లో గీతగోవిందాన్ని కూడా గుర్తుచేశాడు డైరెక్టర్.

” తప్పు నాడైనప్పుడు నలుగురు మధ్యలో కాళ్లు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి” అని విజయ్ చెప్పిన డైలాగ్.. గీత గోవిందంలోని క్లైమాక్స్ సీన్. అందులో రష్మిక అన్నయ్య అయిన సుబ్బరాజు కాళ్లు పెళ్లి మండపంలో అందరిముందు పట్టుకుంటాడు విజయ్. సింబాలిక్ గా గీతగోవిందం ఛాయలు ఉన్నాయని డైరెక్టర్ ఈ డైలాగ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక అందులో రష్మిక కొంచెం పొగరు చూపిస్తుంది.. ఇందులో మృణాల్ కూడా అలానే ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమా.. గీతగోవిందంలా హిట్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×