BigTV English

Lokhsabha Elections 2024: 238 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు.. తగ్గేదేలే అంటూ మరోసారి సై అంటున్నాడు

Lokhsabha Elections 2024: 238 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు.. తగ్గేదేలే అంటూ మరోసారి సై అంటున్నాడు
Lokhsaba Elections 2024
Lokhsaba Elections 2024

Lokhsabha Elections 2024(Telugu news updates): దేవుడా..! ఎక్కువ సార్లు పోటీ చేసి గెలిచి రికార్డులు సృష్టించడం వినే ఉంటాం. కానీ ఎక్కువ సార్లు పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించిన వారు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఒక్కసారి ఓడిపోతేనే రెండో సారి పోటీ చేసేందుకు వెయ్యిసార్లు ఆలోచిస్తుంటాం. అలాంటిది ఈయన వందల సార్లు ఓడిపోయినా సరే మళ్లీ మళ్లీ పోటీ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. మరి ఆయన వివరాలు ఏంటో తెలుసుకుందాం.


ఎన్నికల్లో గెలవాలని ప్రజలకు సేవ చేయాలని బరిలో నిలిచాడు. కానీ ఎన్ని సార్లు పోటీ చేసినా ప్రజలు మాత్రం తనను ఓడిస్తూనే ఉన్నారు. అయినా సరే ఒక్క అడుగు వెనక్కి వేయకుండా పోటీలోకి దిగి ఓడిపోతూనే రికార్డు సృష్టించాడు. వరల్డ్ బిగ్గెస్ట్ లూజర్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన కె. పద్మరాజన్ అనే వ్యక్తి ఎన్నో సార్లు పోటీ చేసి ఓటమిపాలైతూనే ఉన్నాడు. 1988 నుంచి మెట్టూరు నుంచి పోటీ చేయడం మొదలుపెట్టాడు. ప్రజలకు సేవలు అందించాలని పోటీ చేస్తూనే వస్తున్నాడు 65 ఏళ్ల టైర్ల రిపేర్ షాప్ యజమాని. అయితే ఆయన పోటీలో నిలిచినప్పుడు జనాలు నవ్వారని అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోటీ చేస్తూనే ఉన్నాడు.

Also Read: జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. 31న అడ్మిట్ కార్డుల!


రాష్ట్రపతి నుంచి గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికల్లోను పోటీ చేసి నెగ్గలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ.. ఎలక్షన్ కింగ్ గా పేరు సాధించారు. పద్మరాజన్ పలువురు ప్రముఖులకు ప్రత్యర్థిగా పోటీ చేస్తూ ఓడిపోయారు. అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయి, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ తదితరులు ఉన్నారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

నామినేషన్ ఫీజులకు వేలల్లో ఖర్చవుతున్నా గెలుపు కోసం ఆయన వెనుకడుగు వేయట్లేదు. మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తుండగా.. ప్రత్యర్ధి ఎవరు ఎంతటి వారు అనే విషయాన్ని ఆయన లెక్కచేయబోనని అన్నారు. అయితే తాను చేసిన పోటీల్లో ప్రతీ సారి 25వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అయితే ఇది ఎన్నికల్లో 16 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే తిరిగి ఇవ్వబడుతుంది. ఇలా ప్రతీ సారి ఓడిపోతూ అత్యధికంగా ఓటమిపాలైన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పద్మరాజన్ బిగ్గెస్ట్ లూజర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారో లేదో చూడాలి మరి.

Tags

Related News

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Big Stories

×