BigTV English

DS Chauhan: చౌహాన్ గారి ధాన్యం కథ..

DS Chauhan: చౌహాన్ గారి ధాన్యం కథ..

DS Chauhan Comments On Paddy Procurement: అన్నదాత అన్యాయమైపోతున్నాడు. వారిని నిలువుదోపిడి చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించడం లేదు. మిల్లర్లు మోసం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపనలు వస్తే అధికారులు ఏం చేయాలి? వారిని న్యాయం చేస్తామని భరోసా ఇవ్వాలి? విచారణకు ఆదేశించాలి? ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి? తప్పును సరిదిద్దాలి. బాధితులను ఆదుకోవాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మరి మన పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏం చేశారు? మేం చెప్పడం ఎందుకు? మీరే చూసేయండి.


అదీ సంగతి.. రైతుకు పంట ఎప్పుడు కోయాలో తెలీదు. ఎప్పుడు మార్కెట్‌కు తీసుకురావాలో తెలియదు. అసలు వారి ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముకోవాలో అంతకంటే తెలియదు. ఇదీ డీఎస్‌ చౌహాన్ గారు సెలవిచ్చేది. ఇందులో మిల్లర్ల తప్పేలేదు. ట్రేడర్లు చేసిన పాపమేం లేదు. చేసిందంతా రైతులదే. అందుకే నష్టపోతున్నారని చెబుతున్నారు చౌహాన్. తెలంగాణలో ధాన్యం సేకరణ మొదలైంది. అయితే ప్రభుత్వం కనీస మద్ధతు ధరగా నిర్ణయించిన 2 వేల 300 రూపాయలు ఎక్కడా ఇవ్వడం లేదని మార్కెట్ కమిటీ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై క్వింటాలు ధాన్యానికి 17 వందల నుంచి 19 వందల వరకే చెల్లించి రైతులను నిలువునా ముంచుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించి హద్దు దాటితే అస్సలు తగ్గద్దు అంటూ అధికారులను ఆదేశించారు.
అవసరమైతే మిల్లర్ల లైసెన్స్‌లను కూడా రద్దు చేయాలన్నారు. ఓ వైపు సీఎం అగ్గిమీద గుగ్గిలమవుతుంటే.. చౌహాన్ తీరిగ్గా ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ధాన్యం గురించి అడిగితే మామిడికాయ కథ చెప్పి వెళ్లారు.

అంతేకాదు అసలు గింజ తయారు కాక ముందే పంటను కోసేస్తున్నారంటూ ఆయన రివర్స్‌ అటాక్ చేస్తున్నారు. చౌహాన్ మాటలు విన్న తర్వాత ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజంగా చౌహాన్ రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నారా? మిల్లర్లు చేస్తున్న దోపిడికి వత్తాసు పలుకుతున్నారా? ఆయన మిల్లర్లతో మిలాఖత్ అయ్యారా? సీఎం రేవంత్ ఆదేశాలను కూడా ఆయన పట్టించుకోరా? ఇప్పుడీ ప్రశ్నలను వేస్తుంది మేము కాదు.. రైతులు.. అంతేకాదు అసలు చౌహాన్‌కు పంట గురించి ఏం తెలుసని డైరెక్ట్‌గానే ప్రశ్నిస్తున్నారు రైతులు.


Also Read: ఆయన ఆదేశించారు.. నేను పాటించాను..

అయితే ధాన్యం తేమ శాతంపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పంట కోసిన తర్వాత 50 శాతం తేమ ఉండటం అనేది అసాధ్యమంటున్నారు రైతులు మరి అధికారులు దీనికి సంబంధించిన ప్రూఫ్స్‌ చూపిస్తున్నారు. నిజానికి ఇలాంటి జరిగినప్పుడు ఎక్కడ అంత తేమశాతం వచ్చిందో. అక్కడికి వెళ్లి పరిశీలించాలి.. స్థానిక అధికారులను ప్రశ్నించాలి కానీ అలాంటిదేం జరగడం లేదు. పైగా రివర్స్‌లో రైతులదే తప్పు అన్నట్టుగా పోట్రెట్ చేయడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్.

ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఆరోపణలు ఏంటి? MSP కంటే అతి తక్కువ ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని కానీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు.. ఫర్ సపోజ్ నిజంగానే తేమశాతం ఎక్కువగానే ఉందనుకుందాం. మరి అప్పుడు ఏం చేయాలి. రైతులకు అవగాహన పెంచాలి.. అప్పుడే అమ్మవద్దని చెప్పాలి. లేదా ఎక్కువ తేమ ఉన్నా కానీ MSP ధరకే కొనమని మిల్లర్లకు చెప్పాలి. లేదా ఆరబెట్టిన తర్వాతే ధాన్యం కొంటామని చెప్పాలి. ఇవేమీ చేయకుండా ధర తగ్గించి ఎందుకు కొంటున్నారు..?

మిల్లర్లు, ట్రేడర్లు ధర తగ్గించి కొంటున్నా మార్కెట్ యార్డ్ సిబ్బంది ఎందుకు అడ్డుకోవడం లేదు..? బయట జరిగే కొనుగోళ్లకు మాకు సంబంధం లేదంటే ఎలా? ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ మార్కెట్ యార్డ్‌లో కూడా 1900కు మించి ధర ఇవ్వలేదు ట్రేడర్లు, మిల్లర్లు.. అంటే ఒక్కచోట కూఏడా 17 శాతం కన్నా తక్కువ తేమ ఉన్న ధాన్యం మార్కెట్ రాలేదా? అనేది ప్రశ్న.. ఓ వైపు భానుడి భగభగలు మండిపోతున్నాయి.. మధ్యాహ్నం బయటికి వెళితే మాడు పగిలిపోతుంది. అయినా కానీ తేమశాతం అంత ఎక్కువ ఎందుకున్నది అనేది అర్థం కాని ప్రశ్న.. చౌహాన్ గారు. ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి..
ఆరుగాలం కష్టించి పంటను పండించిన అన్నదాతకు న్యాయం చేయాలి.

Tags

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×