BigTV English
Advertisement

Mimi Chakraborty: నన్ను రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Mimi Chakraborty: నన్ను రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Mimi Chakraborty: కోల్ కత్తా రేప్ కేసు ఇండియా మొత్తాన్ని హడల్ పుట్టించిన విషయం తెల్సిందే. ఒక డాక్టర్ ను  సామూహిక అత్యాచారం చేసి చంపేసిన   ఘటన ఇండియాను షేక్ చేసింది. ఆ నిందితులను బహిరంగంగా చంపేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే  నిందితులకు నిరసనగా   ప్రజలు ర్యాలీలు చేస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.


ఇంకోపక్క సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్యనే నటి మీమీ చక్రవర్తి సైతం ఈ ర్యాలీలో పాల్గొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అలా ర్యాలీ చేసిన రెండు రోజులకే ఆమెకు రేప్  బెదిరింపులు రావడం సంచలనంగా  మారింది. ఈ విషయాన్ని మీమీనే స్వయంగా తెలిపింది.

బాధితురాలికి న్యాయం చేయాలనీ డిమాండ్  చేసినందుకు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను కూడా రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు అని మీమీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మీమీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీమీ టీవీ నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.


పలు సీరియల్స్ లో నటించిన ఆమె.. 2012 లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన మీమీ..  మ‌మ‌తా బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్ త‌రుపున ఎంపీగాకూడా  పనిచేసింది. అయితే ఇలా ఒక బాధితురాలికి న్యాయం చేయడం కోసం పోరాటం తప్పు కానప్పుడు.. ఆమెను ఇలా బెదిరిస్తోంది ఎవరు.. ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మీమీ ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×