E-Paper
Advertisement

Game Changer 1St Day Collections: తొలి రోజు కలెక్షన్స్.. అఫీషియల్ పోస్టర్ వదిలిన మేకర్స్..!

Game Changer 1St Day Collections: తొలి రోజు కలెక్షన్స్.. అఫీషియల్ పోస్టర్ వదిలిన మేకర్స్..!
Advertisement

Game Changer 1St Day Collections: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్(Ram Charan). ఈ సినిమా తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). దాదాపు మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ సినిమా కోసం కష్టపడ్డ చిత్ర బృందం, ఎట్టకేలకు జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేసింది. ముఖ్యంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎంతోమంది అనుకున్నారు. అయితే అందరి అంచనాలను ఈ సినిమా బోల్తా కొట్టించింది అని చెప్పవచ్చు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఒక అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు..

Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani),అంజలి(Anjali ) హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్(Thaman) సంగీతాన్ని అందించారు. దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని కూడా మేకర్ విడుదల చేశారు

దేవరా రికార్డ్ బ్రేక్..

Advertisement

ముఖ్యంగా గేమ్ ఛేంజర్ బ్లాక్ బాస్టర్ అంటూ పేర్కొంటూ రూ.186 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే ఎన్టీఆర్ (NTR) దేవర(Devara ) సినిమాకి మొదటి రోజు రూ.172 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా రికార్డును ఈ గేమ్ ఛేంజర్ సినిమా బ్రేక్ చేసింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ నటనతో పోటీపడి మరీ నటించారు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ సోలో హీరోగా నటిస్తే ఎవరిది పై చేయి అవుతుందని అందరూ అనుకున్నారు. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో దేవర సినిమా చేస్తే.. రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల చేశారు. మొత్తానికైతే దేవర సినిమా మొదటిరోజు రూ. 172 కోట్లు రాబట్టి ఫుల్ రన్ ముగిసే సరికి రూ.500 కోట్లు వసూలు చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా మొదటిరోజు రూ.186 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మరి ఫుల్ రన్ ముగిసే సరికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, నవీన్ చంద్ర, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏది ఏమైనా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజు బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×