BigTV English

Perni Nani: పేర్నికి బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి అరెస్ట్ ఖాయమా..?

Perni Nani: పేర్నికి బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి అరెస్ట్ ఖాయమా..?

మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్‌లో మాయమైన రేషన్‌ బియ్యం కుంభకోణం పెద్ద కలకలమే రేపుతోంది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైందన్నారు. తర్వాత పది రోజులకు 4,840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచే సరికి ఆ లెక్క ఏకంగా 7,577 బస్తాలుగా తేలి, అధికారులకే షాక్ ఇచ్చిందంట. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏస్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతుంది.

తమ గోడౌన్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబసభ్యులు గత నెల 26న లేఖ రాస్తే.. ఆ తగ్గిన బియ్యం లెక్కలు తేల్చడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటనపై పోలీసులు గత ఏడాది డిసెంబరు 10న కేసు పెట్టారు. ఆ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ ఏ -1గా, పేర్ని నాని ఏ-6 నిందితులుగా ఉన్నారు. వారు కోర్టుని ఆశ్రయిస్తూ అరెస్టుల నుంచి ఊరట పొందుతున్నారు. ఆ రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.


గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం మినీ వ్యానులను వాడినట్లు చెబుతున్నారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో పాటు ఇతర నిందితులు అంతా కలిసి 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పేర్ని నానికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారంట.

గోడౌన్ మేనేజర్ మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని అకౌంటుకు రూ.1.75 లక్షలు బదిలీ చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రూ.12 వేల జీతానికి పనిచేస్తున్న మేనేజర్ తన యజమాని భర్తకు అంతమొత్తం ఎందుకు పంపించాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మానసతేజ అకౌంట్లో సుమారు రూ.25 లక్షల మేర లావాదేవీలు జరగడం, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తక్కువ జీతానికి పనిచేస్తున్న మేనేజర్ అంత మొత్తం ఎలా ఖర్చు చేశాడు? ఆయనకు ఆ డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: అన్నకి చుక్కలు చూపిస్తున్న చెల్లి.. ఈసారి కొత్త రూట్‌లో..

కీలక ఆధారాలు లభించడంతో నిందితులను కోర్టు అనుమతితో ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు బ్యాంకులో నగదు లావాదేవీల విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మేనేజర్ మానసతేజతో పాటు డ్రైవర్ మంగారావు, మిల్లర్ ఆంజనేయులను పోలీసులు విచారించగా, మేనేజర్ పోలీసులకు సహకరించలేదని చెబుతున్నారు. దీంతో నిందితులను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే నిందితులు ముగ్గురూ మాజీ మంత్రి పేర్ని నానిని కాపాడే ప్రయత్నం చేస్తూ స్వామి భక్తి గట్టిగానే చాటుకుంటున్నారంట.

రేషన్ బియ్యం తరలించడంలో మాజీ మంత్రికి సంబంధం లేదని, తామే అమ్మేశామని పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ స్టేట్ మెంట్ ను నమ్మడం లేదంటున్నారు. భారీ మొత్తంలో బియ్యం తరలించడం నిందితులకు సాధ్యం కాదని, దీనివెనుక పెద్ద హస్తం ఉందనే కోణంలోనే ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నారంట. మరోవైపు కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ సైతం తనకేమీ తెలియదని అంతా మేనేజర్ మానసతేజ మాత్రమే చేశాడని చెప్పారని అంటున్నారు. దాంతో ముందస్తు బెయిల్ పొందిన ఆమెను కూడా మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. మొత్తానికి పేర్ని చుట్టూ ఉచ్చు బిగించేలా పోలీసుల విచారణ జరుగుతుందని అంటున్నారు.

Related News

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Telangana BJP: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Big Stories

×