Tollywood Actress: ముఖ్యంగా ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు.. ఎక్కడలేని కల మొత్తం సెలబ్రిటీలలోనే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. పండుగ దినాన ప్రత్యేకించి అందంగా రెడీ అవ్వడమే కాదు, భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో తమ ఇంటికి సమీపంలో ఉండే ఆలయాలకు భగవంతుని దర్శన కోసం జనాలు బారులు తీరారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తిరుమల తిరుపతికి వెళ్లారు.. అక్కడ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గంలో కాలినడకకు కొండకు చేరుకున్నారు. అంతేకాదు శ్రీవారి దర్శనం కోసం మోకాళ్ళపై తిరుపతి కొండ మెట్లు ఎక్కి, తన భక్తిని చాటుకున్నారు. మరి ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
మోకాళ్ళతో మెట్లెక్కి స్వామిని దర్శించుకున్న నందిని రాయ్..
ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్(Nandini Rai). శ్రీవారి దర్శనం కోసం మోకాళ్లపై తిరుపతి కొండ మెట్లు ఎక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ దళపతి (Vijay Thalapathi) హీరోగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi paidipally)దర్శకత్వం వహించిన ‘వారసుడు’ సినిమాలో శ్రీకాంత్ (Srikanth) ప్రేయసిగా కనిపించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అంతకుముందు నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మాయా’ అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. దీనికి తోడు సుధీర్ బాబు(Sudheer Babu) సరసన ‘మోసగాళ్లకు మోసగాడు’ తో పాటు తెలుగులో మరికొన్ని చిత్రాలు చేసింది. అయితే క్రేజ్ మాత్రం రాలేదు. ఇకపోతే ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇక ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ తన మొక్కు తీర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్ల పైకి మోకాళ్ళతో మెట్లు ఎక్కుతూ.. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
మిస్ ఆంధ్రప్రదేశ్ గా పలుమార్లు గెలుపొందిన బ్యూటీ..
నందిని రాయ్ విషయానికి వస్తే.. నటిగా, మోడల్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. 2010లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా టైటిల్ గెలుచుకుంది. 1990 సెప్టెంబర్ 18న సికింద్రాబాద్, తెలంగాణలో జన్మించింది. హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్ నుండి 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె, లండన్ లో ఫైనాన్స్ లో ఎంబీఏ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె, 80 కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకి దాదాపు మోడల్ గా పనిచేసింది. అంతేకాదు 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ ప్యాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వంటి టైటిల్స్ కూడా గెలుచుకుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">