E-Paper
Advertisement

Game Changer : ‘గేమ్ ఛేంజర్’కి పెయిడ్ ప్రమోషన్స్.. క్లారిటీ ఇచ్చిన మెహబూబ్

Game Changer : ‘గేమ్ ఛేంజర్’కి పెయిడ్ ప్రమోషన్స్.. క్లారిటీ ఇచ్చిన మెహబూబ్
Advertisement

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక దసరాకు ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతుందని ప్రకటించడంతో మెగా ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ కి సంబంధించిన రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రీల్స్ వెనుక పెయిడ్ ప్రమోషన్స్ స్ట్రాటజీ ఉందంటూ ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ పై రీల్స్ చేయాలంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు చిత్రబృందం డబ్బులు ఇస్తుంది అంటూ బయటకు వచ్చిన వార్తపై తాజాగా బిగ్ బాస్ మెహబూబ్ స్పందించాడు. పైగా అందులో మెహబూబ్ పేరు కూడా ఉందనేది రూమర్ల సారాంశం.

అసలు ఈ స్కామ్ ఏంటంటే?

Advertisement

తాజాగా సోషల్ మీడియాలో మెహబూబ్ షేర్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. అందులో ‘రీల్ చేయడానికి రూ.10,000 ఇస్తున్నారట కదా? నువ్వు కూడా పెయిడ్ అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం?’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించినట్టుగా కనిపిస్తోంది. ఇక దానికి మెహబూబ్ ‘అవును రూ.80,000 పంపారు, ట్యాగ్స్ కూడా వాళ్లే ఇచ్చి రీల్స్ చేయమని చెప్పారు’ అంటూ రిప్లై ఇచ్చినట్టుగా ఉంది. ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఓ నెటిజన్ తాజాగా బిగ్ బాస్ మహబూబ్ ను డైరెక్ట్ గా ప్రశ్నించాడు. ‘ఈ చాట్ నీదేనా?’ అని అడగగా… మహబూబ్ స్పందిస్తూ ‘దీన్ని ఎవరు చేశారో గానీ చాలా టాలెంట్ ఉంది. బాగా ఎడిట్ చేశారు ఈ చాటింగ్ చేసిన అవతలి మనిషి పేరు ఏంటో తెలిస్తే బాగుంటుంది… కానీ ఇది నిజం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ విషయం గురించి మెహబూబ్ క్లారిటీ ఇచ్చాడు అన్న విషయం కన్నా ఆ ఫేక్ స్క్రీన్ షాట్లే వైరల్ అవుతుండడం గమనార్హం. మరి ఈ ఫేక్ వార్తలపై ‘గేమ్ ఛేంజర్’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ‘గేమ్ ఛేంజర్’లోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ కి మెహబూబ్ అదిరిపోయే స్టెప్స్ వేసిన రీల్ కూడా మరోవైపు వైరల్ అవుతుంది.

సంక్రాంతికా? క్రిస్మస్ కా?

Advertisement

కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, ఎస్జె సూర్య వంటి స్టార్స్ కీలకపాత్రలను పోషించారు. ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీ క్రిస్మస్ కి రాబోతుందని ఓవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు ఈ సినిమాను సంక్రాంతి రేసులోకి దింపబోతున్నారు అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గాని టీజర్ ను అయితే దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×