BigTV English

Game Changer : ‘ గేమ్ ఛేంజర్ ‘ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్..

Game Changer : ‘ గేమ్ ఛేంజర్ ‘ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్..

Game Changer : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్ ను శంకర్ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


గేమ్ ఛేంజర్ మూవీ నుంచి గతంలో జరగండి జరగండి… అంటూ సంగీత దర్శకుడు తమన్ పక్కా పెప్పీ మాస్ నంబర్ అందించారు. అది చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వినాయక చవితికి రెండో సాంగ్ ఈ నెలలో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ అప్డేట్ లేదు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి. రెండో పాటను సెప్టెంబర్ 30 న రిలీజ్ చేయటానున్నట్లు ప్రకటించారు. కాగా దీనిపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యూయట్ సాంగ్ వస్తుందా, లేక సోలో సాంగ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు..

Game Changer crazy update second song release date lock
Game Changer crazy update second song release date lock

గేమ్ ఛేంజర్’ సినిమాను క్రిస్మస్ బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత ‘దిల్’ రాజు ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదల మీద కొందరికి సందేహాలు ఉన్నాయి. ఆ కారణంగా ‘మ్యాడ్ 2’, ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలను విడుదలకు రెడీ చేస్తున్నారని… ఒకవేళ అనుకున్న సమయానికి ‘గేమ్ ఛేంజర్’ విడుదల కాకపోతే ఆయా సినిమాలు విడుదల అవుతాయని టాక్.. మరి చివరకి ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.


ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. ఇక చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ ఉంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాది చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజ్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అయితే తాజాగా క్రిష్టమస్ కానుకగా సినిమా రాబోతుందని దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. క్రిస్మస్‌కి థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటూ ఇప్పటికే గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.. పుష్ప 2 కూడా అదే నెలలోనే డిసెంబర్ 6 న విడుదల కాబోతుంది… ఈసారి మెగా Vs అల్లు వార్ చూడాలని ఇటు బన్నీ, అటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. మరి ఈ రెండు సినిమాలు ఎలా పోటి పడతాయో.. ఎంత కలెక్షన్స్ రాబడుతాయో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×