BigTV English

Gujarat School Girl Rape And Murder: ఎంత దారుణం.. 6 ఏళ్ల పాపను హత్య చేసి.. ఏమీ తెలియనట్లు బుకాయించిన పెద్దమనిషి

Gujarat School Girl Rape And Murder: ఎంత దారుణం.. 6 ఏళ్ల పాపను హత్య చేసి.. ఏమీ తెలియనట్లు బుకాయించిన పెద్దమనిషి

Gujarat School Girl Rape And Murder| కొన్ని రోజుల క్రితం ఒక 6 ఏళ్ల పాప స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆ పాప శవం స్కూల్ వెనకాల లభించింది. క్లాస్ రూమ్ లో పాప బ్యాగ్, షూస్ కూడా కనిపించాయి. పోలీసుల విచారణలో ఆ పాప అసలు ఆ రోజు స్కూల్ కే వెళ్లలేదని తేలింది. దీంతో లోతుగా విచారణ చేస్తే.. హంతకుడెవరో తెలిసి అందరూ షాకయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రం దాహోడ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ వెనకాల ఒక అరేళ్ల పాప శవం లభించింది. అప్పటికే పోలీసులకు ఆ పాప తల్లిదండ్రులు మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు పాప శవం స్కూల్ బిల్డింగ్ వెనకాల ఎలా లభించింది? సూల్ లో ఏదైనా జరిగిందా? ఎవరు చేశారు? అని విచారణ మొదలుపెట్టారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


కానీ విచిత్రంగా ఒకటి తరగతి చదువుకునే ఆ పాప అసలు ఆ రోజు స్కూల్ కే రాలేదని టీచర్లు తెలిపారు. దీంతో విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అసలు ఏం జరిగిందో? ముందు నుంచి ఆరా తీయాలని పోలీసులు భావించి.. పాప తల్లిదండ్రులను పిలిచి అడిగారు. 6 ఏళ్ల పాప కాబట్టి ఆమెను స్కూల్ కు ఎవరు తీసుకెళ్లారు? రోజూ పాప స్కూల్ కు ఎలా వెళ్లేదని ప్రశ్నించారు. అప్పుడు తెలిసింది.. అసలు నిజం.

పాప ప్రతిరోజు స్కూల్ కు వెళ్లేందుకు ఒక కార్ వస్తుంది. ఆ కార్ ఒక పెద్దమనిషిది. ఆ పెద్ద మనిషి మరెవరో కాదు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గోవింద్ నాత్. ఆయన పాప ఇంటికి సమీపంలోనే నివాసంముండడంతో ప్రతిరోజు పాప ను ఉదయం స్కూల్ కు తనతో తీసుకెళ్లే వాడు. అలా ఆ రోజు ఉదయం కాస్త ఆలస్యంగా 10 గంటలకు పాప ఇంటి ముందు ప్రిన్సిపాల్ కారు వచ్చి ఆగింది. పాప తల్లి.. రోజూ లాగే పాపను కారు ఎక్కించి ఇంట్లోకి వెళ్లిపోయింది. అయితే కారులో డ్రైవర్ లేడు. స్వయంగా ప్రిన్సిపాల్ కారు నడుపుతున్నాడు. కొద్ది దూరం వెళ్లాక ఆ ప్రిన్స్ పాల్ కామంతో కళ్లు మూసుకుపోయి.. పాపపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. పాప గట్టిగా అరుస్తుండడంతో పాప గొంతు నులిమి చంపేశాడు.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

ఆ తరువాత ఏమీ తెలియనట్లు స్కూల్ కు వెళ్లాడు. కానీ పాప శవాన్ని సాయంత్రం స్కూల్ అయిపోయేంత వరకు కారులోనే పెట్టి లాక్ చేశాడు. సాయంత్రం స్కూల్ నుంచి అందరూ వెళ్లిపోయాక.. పాప శవాన్ని స్కూల్ బిల్డింగ్ వెనుక వైపు పడేసి.. పాప స్కూల్ బ్యాగ్, షూస్ క్లాస్ రూమ్ లో పడేశాడు. పోలీసులకు పాప తల్లిదండ్రులు చెప్పింది విని ప్రిన్సిపాల్ పై అనుమానం కలిగింది. అందుకే ముందుగా ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కానీ ప్రిన్స్ పాల్ తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆ రోజు పాపను స్కూల్ లో వదిలేసి తాను పనిమీద అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. కానీ స్కూల్ టీచర్లు అంతా పాప స్కూల్ కు రాలేదని చెప్పాడంతో ప్రిన్సిపాల్ అబద్దం చెబుతున్నాడని అర్థమైపోయింది.

దీంతో పోలీసులు తమ పద్ధతిలో ప్రిన్స్ పాల్ ను ప్రశ్నించారు. అప్పుడు జరిగినదంతా వివరించాడు. ప్రస్తుతం పోలీసులు.. స్కూల్ ప్రిన్స్ పాల్ గోవింద్ నాత్‌ను అరెస్టు చేసి.. భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టాల ప్రకారం.. కేసు నమోదు చేశారు. ఆరేళ్ల చిన్నారి పై హత్యాచారం జరిగిన ఘటన గురించి గుజరాత్ విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రిన్స్ పాల్ ఈ నీచమైన చర్యకు పాల్పడిన విషయం తెలిసి తాను షకైపోయానని, చాలా బాధాకరమైన, అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×