BigTV English

Jammu and Kashmir Elections: జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. పోరు రసవత్తరం!

Jammu and Kashmir Elections: జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. పోరు రసవత్తరం!

Jammu and Kashmir Assembly elections: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి రెండో దశ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ మేరకు 6 జిల్లాలలోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలన నేతలు బరిలో ఉన్నారు.


మొత్తం 25.78 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. అలాగే 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందులో 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాలలో.. 2,446 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో రాజౌరీ సహా పలు చోట్ల కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.


పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్ బల్, రియాసి జిల్లాలలో పోలింగ్ జరగనుంది. గందర్ బల్, బుద్గాం స్థానాలలో ఓమర్ అబ్దుల్లా పోటీలో ఉండగా.. సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ కర్ర, నౌషెరా స్థానంలో రవిందర్ రైనా బరిలో నిల్చున్నారు. బీర్వా, గందర్ బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది. జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.

Also Read: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

రెండో దశ ఓటింగ్‌లో జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాలు, కాశ్మీర్ ప్రాంతంలోని 3 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చన్నపొర, జడిబాల్, ఈద్గా, బ్లాక్ (ఎస్టీ), గదర్బాల్, గరీబ్బల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్  ఉన్నాయి. అలాగే చరర్-ఎ-షరీఫ్, చదూరా, గులాబ్‌ఘర్ (ఎస్టీ), సెంట్రల్ షాల్తెంగ్, బుద్గాం, బీర్వా, ఖాన్‌సాహిబ్, రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే-సుందర్‌బాని, నౌషేరా, రాజ్‌సౌరి (ఎస్టీ), బుధాల్ (ఎస్టీ), తన్నమండి (ఎస్టీ), సురన్‌కోట్ (ఎస్టీ), పూంచ్ హవేలీ మెంధార్ (ఎస్టీ) పవర్ జోన్‌లు ఉన్నాయి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×