BigTV English

Game Changer: ‘ గేమ్ ఛేంజర్ ‘ రన్ టైం అంత తక్కువా? శంకర్ ప్లాన్ ఇదా..?

Game Changer: ‘ గేమ్ ఛేంజర్ ‘ రన్ టైం అంత తక్కువా? శంకర్ ప్లాన్ ఇదా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్.. ట్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా వస్తున్నా ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ కు విడుదల కావాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాల వల్ల జనవరికి షిఫ్ట్ అయ్యింది. దాంతో ఈ మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. విడుదలకు తక్కువ సమయం ఉండటం తో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు. మొన్న వచ్చిన సాంగ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. శంకర్ సినిమాలకు ఎప్పుడు లేనంత తక్కువ సమయంలోనే ఈ సినిమాను తీసుకువస్తున్నారని ఓ వార్త వినిపిస్తుంది. మరి ఈ మూవీ రన్ టైం ఎంతో తెలుసుకుందాం..


‘గేమ్ చేంజర్’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే.. పుష్ప 2 తర్వాత ఈ మూవీ అంచనాలు భారీగా పెరిగాయి. ఆ మూవీ తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే. డిసెంబర్ 21 యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు.. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన నానా హైరానా మంచి వ్యూస్ ను రాబట్టింది. దాని తర్వాత వచ్చిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త ప్రోమోలో గతంలో చూడని విజువల్స్ ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది.. పుష్ప 2 3 గంటలకు పైగా ఉంది. అలాంటిది రామ్ చరణ్ మూవీకి అంత తక్కువ ఏంది అని నెట్టింట చర్చనీయంశంగా మారింది.

సాదారణంగా శంకర్ సినిమాలంటే మినిమమ్ మూడు గంటలకు పైగా ఉంటాయి. ఇంత తక్కువ లెన్త్ రామ్ చరణ్ కు ప్లాన్ చేయడమంటే ఏదో ప్లాన్ ఉందేమో అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ప్రాధమికంగా శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ ఇంతే ఉంటుందట. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ లీకులు తెగ ఊరించేలా ఉన్నాయి. ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టైం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. తమన్ సంగీతంలో ఇప్పటికే మూడు పాటలు రాగా నాలుగోది అమెరికాలో లాంచవుతుంది.. ఇక వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ లో స్పీడును పెంచనున్నారు.. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×