Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు చరణ్. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు చరణ్ ఎంతో సక్సెస్ ను అందుకున్నాడు. కానీ, అంతకు మించిన అవమానాలను, ట్రోలింగ్ ను ఎదుర్కుంటూనే వస్తున్నాడు. ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
ఇక చరణ్ 2012 లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత ఉపాసనపై కూడా ట్రోలింగ్ మొదలయ్యింది. అందంగా లేదని, చరణ్ కు సరైన జోడీ కాదని, ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడని ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇక మాటలకు ఇంకా ఆజ్యం పోసినట్లు పదేళ్లుగా వీరు తల్లిదండ్రులు కాకపోవడంతో మరింత ట్రోల్ చేశారు. వాటిని కూడా ఈ జంట భరిస్తూ వచ్చింది. ఇక చివరకు పదేళ్ల తరువాత ఉపాసన అందరికీ శుభవార్తను వినిపించింది. తాను గర్భవతిని కంబోతున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి మెగా వారసురాలి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.
Allu Arjun: అల్లు స్నేహకు భయపడుతున్న బన్నీ.. అంతగా ఏం చేసి ఉంటుందో.. ?
గతేడాది జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా కుటుంబంలో ఆమె కేవలం వారసురాలు మాత్రమే కాదు లక్ష్మీ దేవి అని చెప్పాలి. ఇక ఆ చిన్నారికి క్లింకార అని పేరు పెట్టారు. క్లింకార పుట్టాకే చిరుకు పద్మవిభూషణ్ వచ్చింది. వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే వారసురాలు పుట్టాకే మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ చిన్నారి పుట్టి ఏడాది దాటుతుంది.
ఇప్పటివరకు క్లింకార ముఖాన్ని మాత్రం అభిమానులకు చూపించలేదు. సమయం వచ్చినప్పుడు తామే తమ వారసురాలి ముఖాన్ని రివీల్ చేస్తామని ఉపాసన చెప్పుకొచ్చింది. ఎప్పుడెప్పుడు క్లింకార ఫేస్ చూస్తామా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చూస్తూ ఉండగానే క్లింకార పెద్దది కూడా అయిపోతుంది.
Sobhita Akkineni: పెళ్లి తరువాత శోభితాలో మార్పు.. ఇది గమనించారా.. ?
తాజాగా క్లింకార లేటెస్ట్ ఫోటోను ఉపాసన అభిమానులతో పంచుకుంది. ఉపాసన తండ్రి చేతుల్లో మెగా వారసురాలు ఎంతో అందంగా కనిపిస్తుంది. అపోలో హాస్పిటల్స్ లో ఉన్న ఆలయంలో జరిగిన పూజలో ఉపాసన పాల్గొంది. ఆమెతో పాటు క్లింకారను కూడా తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకుంది.
” అపోలో హాస్పిటల్ లోని ఆలయంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవములలో తన తాతముత్తాతలతో క్లింకార కూడా భాగమవ్వడం ఎంతో ఆశీర్వాదం. తన తాత చేతుల్లో ఆమెను చూడడం.. నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ ఆలయం నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ క్షణం వెలకట్టలేనిది. ఓం నమో వెంకటేశాయ” అంటూ రాసుకొచ్చింది.
Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ నమ్మకాన్ని నిలబెట్టిన అవినాష్.. అందుకే ఈ స్పెషల్ సర్‌ప్రైజ్
ఇక క్లింకార పసుపు రంగు పట్టు లంగా జాకెట్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఏంటి అప్పుడే మా క్లింకార పాప ఇంత పెద్దది అయిపోయిందా.. ? అని కొందరు. ఇప్పటికైనా మెగా వారసురాలి ఫోటోను షేర్ చేయమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Klin Kaara is truly blessed to join her
Great Grandparents at the Sri Venkateswara Swamy Vari Pavithrotsavamulu at @HospitalsApollo temple today. Seeing her in her Thatha’s arms reminds me of my childhood 🥰
This temple holds a very special place in my heart, and this moment =… pic.twitter.com/WM2qpzsYSU— Upasana Konidela (@upasanakonidela) December 12, 2024