YouTube : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) కంటెంట్ క్రియేటర్ల కోసం అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ భాషలో వీడయోనైనా తమ భాషలోనే వినే అవకాశం కల్పిస్తూ ఆటో డబ్బింగ్ (Youtube Auto Dubbing Feature) పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇక ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..!
యూట్యూబ్ కు యూజర్స్ నుంచి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్స్ ను పెంచుకుంటూ పోతున్న యూట్యూబ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే సరికొత్తగా మూడు ఫీచర్స్ ను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుపుతూ ఈ విషయాన్ని తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. ఇక కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ తో ఇతర భాషల్లోనూ తమ కంటెంట్‌ను తేలికగా వినిపించొచ్చు.
యూట్యూబ్‌లోని కొత్త ఆటో డబ్బింగ్ ఫీచర్ – యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఆడియో డబ్బింగ్ ఫీచర్ (Youtube Auto Dubbing Feature) కటెంట్ క్రియోటర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. వినిపిస్తుంది. ఇక కటెంట్ ను క్రియోట్ చేసి ఎలాంటి భాషా పరమైన ఇబ్బందులూ లేకుండా ఇతర భాషల్లో తమ వీడియోలను పోస్ట్ చేసేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. దీంతో ఇతర భాషలకు చెందిన వీక్షకులు సైతం వీరి కంటెంట్‌ను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్ ఇంగ్లిష్ లోని వీడియో కంటెంట్ ను హిందీ, ఇండోనేషియన్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, జపనీస్, పోర్చుగీస్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ యూట్యూబ్ ఈ బాషల్లో మాత్రమే పనిచేస్తుంది. వీడియో వీడియో పైన ఉన్న ఏ బాషల్లో ఉన్నా ఆటోమెటిక్‌గా ఇంగ్లిష్‌లోకి మారిపోయి యూజర్ కు వినిపిస్తుంది.
యూట్యూబ్ లో ఈ ఫీచర్ తో డబ్ చేసిన ఆడియోలపై ‘ఆటో డబ్బ్‌డ్’ అనే లేబుల్ కనిపిస్తుంది. ఒకవేళ డబ్బింగ్ వాయిస్ వద్దనుకునే యూజర్స్.. ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి ఒరిజినల్ వాయిస్‌నే వినొచ్చు. కంటెంట్ క్రియేటర్లు వీడియోను అప్‌లోడ్ చేయగానే ఈ ఫీచర్ ఆటోమెటిగ్గా పనిచేస్తుంది. వాయిస్‌ని గుర్తించి సపోర్ట్ చేసే భాషల్లోకి మారుస్తుంది. ఇక యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో డబ్బ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. వీటిని నియంత్రించే పూర్తి అధికారం కంటెంట్ క్రియేటర్లకు ఉంటుంది. అయితే వాయిస్‌ను గుర్తించని సందర్భాల్లో మాత్రం డబ్బింగ్ ఆప్షన్ పనిచేయదని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ను కంటెంట్ క్రియేటర్ల ఉపయోగించాక వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇందులో మరిన్ని మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ స్పష్టం చేసింది.
ALSO READ : ‘నేనే దొరికానా? ఆ రెండు సరిపోలేదా?’ – లేఆఫ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి తీవ్ర భావోద్వేగం