E-Paper
Advertisement

Game Changer Release Date: హాలీవుడ్ లోనూ తిరుగులేదు… ఇక గ్లోబల్ రేంజ్ లో రికార్డు బ్రేక్ అవ్వడమే

Game Changer Release Date: హాలీవుడ్ లోనూ తిరుగులేదు… ఇక గ్లోబల్ రేంజ్ లో రికార్డు బ్రేక్ అవ్వడమే
Advertisement

Game Changer Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్. అఫీషియల్ గా కాకపోయినా ‘గేమ్ ఛేంజర్’ మూవీ హాలీవుడ్ లో తిరుగులేని విధంగా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు రేంజ్ లో రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఆ ప్లస్ పాయింట్ ను ఉపయోగించుకుని గ్లోబల్ రేంజ్ లో సత్తా చూపించే టైం నిజంగానే వచ్చేసిందా? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

‘గేమ్ ఛేంజర్’కు కలిసి రానున్న రిలీజ్ డేట్ 

Advertisement

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా నటుడిగా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవడంతో ఆయన నెక్స్ట్ మూవీ గురించి మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే రాజమౌళి ఇచ్చిన ‘గ్లోబల్ స్టార్’ హోదాను చెర్రీ తన నెక్స్ట్ మూవీతో నిలబెట్టుకుంటాడా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో తేలిపోనుంది. గత కొన్ని రోజుల నుంచి ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ పై ఓ రేంజ్ లో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ముందుగా సంక్రాంతికి థియేటర్లలోకి ‘విశ్వంభర’ మూవీతో వస్తానని ప్రకటించగా, తాజా సమాచారం ప్రకారం ఆయన సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ ప్లేస్ ను ‘గేమ్ ఛేంజర్’తో చెర్రీ రీప్లేస్ చేస్తాడని టాక్ నడుస్తోంది.

ఈ మేరకు 2025 జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ జనవరి 9న పడబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే ఇది ఓవర్సీస్ లో ఎక్సలెంట్ రిలీజ్ డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డేట్ రోజు ‘గేమ్ ఛేంజర్’ మూవీకి పోటీగా హాలీవుడ్లో సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఈ వార్తలు గనక నిజమైతే చెర్రీ గ్లోబల్ రేంజ్ లో రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. అంతేకాకుండా భారీ సంఖ్యలో థియేటర్లో దొరికే ఛాన్స్ ఉంది.

Advertisement

చెర్రీ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పొలిటికల్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి కొనసాగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇప్పుడిప్పుడే మ్యూజికల్ ప్రమోషన్స్ ని షురూ చేశారు మేకర్స్. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత చెర్రీకి ఇది ఓ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటేనే చెర్రీ గ్లోబల్ స్టార్ అనే ఆ బిరుదు సార్థకం అయినట్టు. మరి చెర్రీ హాలీవుడ్లో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈసారి గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటి తన గ్లోబల్ స్టార్ టాగ్ ను నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×