BigTV English

Honey Trap: జమీమా గ్యాంగ్ దుర్మార్గపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. విస్తుపోతున్న పోలీసులు

Honey Trap: జమీమా గ్యాంగ్ దుర్మార్గపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. విస్తుపోతున్న పోలీసులు

Honey Trap: సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఎందరో బాధితులను మోసం చేసిన హనీ ట్రాప్ కీలక సూత్రధారి కేసులో రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హనీ ట్రాప్ పేరిట రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందరినో మోసం చేసిన కీలక సూత్రధారి జాయ్ జమీమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అసలైన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు వేగవంతం చేశాయి.
కాగా వైజాగ్ పోలీసులు ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. కేసులో భాగమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన జమీమా.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.


తాజాగా జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించిన ఓ బాధితుడు సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్ళగక్కాడు. ఈ గ్యాంగ్ ఇచ్చిన మత్తు కారణంగా తన శరీరంపై పొక్కులు రావడంతో.. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తదురు బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో మంచంపై నిద్రపోలేని స్థితి ఉందని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అతను కోరుతున్నాడు.

ఇక జమీమా గురించి రోజుకొక సంచలన విషయాలు తెలుసుకుంటున్న పోలీసులు అవాక్కవుతున్నారు. అందం పెట్టుబడిగా మార్చి.. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని.. వారి నగ్న వీడియోలతో బెదిరించడం.. వంటివి ఈ గ్యాంగ్ ముఠా అరాచకాలలో ప్రధానమైనది. అంతేకాదు బాధితుల గృహాలకు అర్థరాత్రి కూడా వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.


Also Read: Divvela Madhuri : పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే కేసు పెడతారా ? కోర్టులో చూసుకుంటా

కాగా తన వలలో పడ్డవారికి మత్తుమందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి వారి నుండి డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మార్చుకున్న జమీమా.. ధనవంతులను టార్గెట్ గా మార్చుకొని దందా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వైజాగ్ సీపీకి రోజురోజుకు ఇదే విషయంపై ఫిర్యాదులు అందుతుండగా.. పోలీసుల అప్రమత్తమై అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు.. ప్రస్తుతం వారి ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వైజాగ్ పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి.. దర్యాప్తు ముందుకు సాగిస్తుండడంతో బాధితులకు భరోసా లభించినట్లయింది. అంతేకాక వైజాగ్ పోలీసుల తీరు పట్ల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

కాగా ఈ ముఠాలో చిక్కుకొని బాధించబడ్డ భాదితుడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో వైజాగ్ సిటీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అందుకే యువత సోషల్ మీడియాను మంచికే వినియోగించుకోవాలని, ఇటువంటి మాయలేడీల వలలో పడరాదని మేధావులు సూచిస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×