BigTV English

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

TGSRTC will Inaugurating 35 Electric Buses Today: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త బస్సులను తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే మరో 35 ఎలక్ట్రిక్ బస్సులను ఆదివారం ప్రారంభించనున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ బస్సుల్లోనూ రద్దీ పెరుగుతుండడంతో టీజీఎస్ఆర్టీసీ మరో కొత్త బస్సులను తీసుకొస్తుంది.


హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి రూట్లలో నడుస్తున్నాయి. అయితే తెలంగాణలో పొల్యుషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది.

రాష్ట్రంలోని ఆరు డిపోల నుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది. ఈ మేరకు కరీంనగర్ 2, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ 2 డిపోలలో ప్రారంభించనున్నారు. తొలుత ఆదివారం కరీంనగర్ 2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.


ఈ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. కరీంనగర్ నుంచి జేబీఎస్, మంథని, గోదాదరిఖని, జిగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఇవి నడవనున్నాయి.

ఇదిలా ఉండగా, కరీంనగర్ రీజియన్‌కు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా.. తొలివిడతగా 35 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించనున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్లలో కరీంనగర్ టూ జేబీఎస్ వరకు ప్రతి రోజు ఒక్కో బస్సు రెండు ట్రిప్పులు రాకపోకలు చేయనుంది. దీంతో 33 బస్సులు.. ఒకేరోజు 66 ట్రిప్పులు నడిపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: హైడ్రా కమిషనర్ కు షాక్… కేసు నమోదు చేసిన హెచ్‌ఆర్‌సీ

ఇదిలా ఉండగా, కరీంనగర్ రీజియన్‌కు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా.. తొలివిడతగా 35 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించనున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్లలో కరీంనగర్ టూ జేబీఎస్ వరకు ప్రతి రోజు ఒక్కో బస్సు రెండు ట్రిప్పులు రాకపోకలు చేయనుంది. దీంతో 33 బస్సులు.. ఒకేరోజు 66 ట్రిప్పులు నడిపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో అద్దె ప్రాతిపదికన నడపనున్నారు. వీటికి సంబంధించిన పర్యవేక్షణ ఆర్టీసీ చూసుకోనుంది. ఇప్పటికే వీటికి అవసరమైన 11కేవీ విద్యుత్ లైన్లను వేసి 14 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రెండో విడతో మరో 35 బస్సులను తీసుకురానుంది. ఇలా మొత్తం 70 బస్సుల చేరిన వెంటనే కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు మరో ఆరు బస్సులను నడపనుంది.

అలాగే, కరీంనగర్ నుంచి గోదావరిఖనికి తొమ్మిది, కరీంనగర్ నుంచి మంథనికి నాలుగు బస్సులు నడపనుంది. ఇక, కరీంనగర్ నుంచి కామారెడ్డి, జగిత్యాలకు ప్రత్యేకంగా ఆరు చొప్పున బస్సులు నడిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కరీంనగర్ నుంచి సిరిసిల్లకు నాన్ స్టాప్ బస్సులు ఆరు వరకు నడపనుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×