E-Paper
Advertisement

Game Changer: ఒరేయ్.. సినిమా మొత్తం సోషల్ మీడియాలోనే చూపించేస్తున్నారు కదరా

Game Changer: ఒరేయ్.. సినిమా మొత్తం సోషల్ మీడియాలోనే చూపించేస్తున్నారు కదరా
Advertisement

Game Changer:ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఇండస్ట్రీ లీకులను ఆపలేకపోతుంది. ఎంత పెద్ద సినిమా అయినా ఈ లీకురాయుళ్ల చేతిలో పడుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమా షూట్ జరుగుతుంది అంటే.. అక్కడకు వెళ్లి.. ఎవరికి తెలియకుండా ఫోన్ లో వీడియోలు తీసి.. లైక్స్ కోసం, షేర్స్ కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీన్ని మేకర్స్ సైతం నియంత్రించలేకపోతున్నారు.

కల్కి సమయంలో ఇలా జరిగితే వైజయంతి మూవీస్ బ్యానర్ మేకర్స్ చాలా సీరియస్ అయిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ఈ లీకురాయుళ్లు.. గేమ్ ఛేంజర్ మీద పడ్డారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

Advertisement

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నాడని, తండ్రీకొడుకులగా నటిస్తున్నాడని లీకుల ద్వారానే తెలిసింది. ఇక రెండు పాత్రల లుక్స్ కూడా లీక్ ఫోటోల ద్వారానే తెలిసింది. కియారా లుక్, అంజలి లుక్.. ఇలా ఒకటేమిటి.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ లీక్ అవ్వడం వలనే ప్రేక్షకులకు తెలుస్తోంది.

అంతెందుకు జరగండి.. జరగండి సాంగ్ కూడా ముందు లీక్ అయ్యాకానే.. మేకర్స్ ఒరిజినల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో సీన్ ను లీకురాయుళ్లు లీక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఒక ఎయిర్ పోర్ట్ సీన్ షూట్ చేస్తుండగా.. ఆ సీన్ మొత్తాన్ని కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్.. ఒక పొలిటికల్ లీడర్ కు వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

Advertisement

బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో చరణ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్నీ చూసిన అభిమానులు ఒరేయ్.. సినిమా మొత్తం సోషల్ మీడియాలోనే చూపించేస్తున్నారు కదరా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×